Nimisha Priya Case: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం

నిమిష ప్రియ చేతిలో హతమైన తలాల్‌ అబ్దో మెహదీ సోదరుడు అబ్దెల్ ఫతే మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉరిశిక్ష ఆలస్యమైనప్పటికీ అది అమలవుతుందని చెప్పుకొచ్చాడు. బ్లడ్ మనీకి అంగీకరించేందుకు తాము ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పాడు.

New Update
Nimisha Priya

Nimisha Priya

Nimisha Priya Case: కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జులై 16న ఆమెకు ఉరిశిక్ష పడనుండగా.. చివరి సమయంలో యెమెన్ స్థానిక అధికారులు ఆ ప్రక్రియను వాయిదా వేశారు. అయితే తాజాగా మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. నిమిష ప్రియ చేతిలో హతమైన తలాల్‌ అబ్దో మెహదీ సోదరుడు అబ్దెల్ ఫతే మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉరిశిక్ష ఆలస్యమైనప్పటికీ అది అమలవుతుందని చెప్పుకొచ్చాడు. బ్లడ్ మనీకి అంగీకరించేందుకు తాము ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పాడు. 

Also Read: జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఇవే

నిమిషకు ఉరిశిక్ష వాయిదా పడేముందు సోమవారం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దెల్‌ ఫతే మెహదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. నిమిష ప్రియ తన సోదురుడు తలాల్‌పై చేసిన ఆరోపణలను అతడు ఖండించాడు. తన సోదరుడు ఆమెను వేధించాడని, పాస్‌పోర్ట్‌ను లాక్కున్నాడని చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపాడు. ఆమె కోర్టులో ఈ విషయాలను అసలు చెప్పనేలేదన్నాడు. ఆమెకు విధించిన దేవుడి చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశాడు.  నిమిష ప్రియ పాల్పడ్డ ఘాతుకానికే కాకుండా దీర్ఘకాలికంగా సాగిన ఈ కేసు వల్ల తమ కుటుంబం ఎంతో మనోవేదనకు గురైందని తెలిపాడు. 

ముఖ్యంగా భారతీయ మీడియా నిమిష ప్రియను ఒక బాధితురాలిగా చూపిస్తూ నిజాన్ని వక్రీకరించడాన్ని చూసి మేము బాధపడుతున్నామని చెప్పాడు. ఎలాంటి వివాదమైనా, అది ఎంత పెద్దదైనా హత్యను ఎప్పటికీ సమర్థించలేమన్నాడు. మొదట్లో నిమిష, తన సోదరుడు తలాల్‌ మధ్య సంబంధం బాగానే ఉండేదని చెప్పాడు. ఈ కేసులో హత్య చేసిన వ్యక్తిని బాధితురాలిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశాడు. తాము నిమిషను క్షమించేది లేదని.. ఈ కేసులో దేవుడి చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తేల్చిచెప్పాడు. 

Also Read: Devi Sri Prasad Energy Secret: నా ఎనర్జీకి సీక్రెట్ అదే.. దేవీ శ్రీ ప్రసాద్ ఫిట్‌నెస్ ఫార్ములా తెలిస్తే షాకే..!

అసలేంటి ఈ కేసు

నిమిష ప్రియ కేరళలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడే జాబ్‌లో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత యెమెన్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించాలనుకుంది. అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం నిమిష అక్కడున్న తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీళ్లద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నిమిష తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్‌కు వచ్చింది. అది ముగిశాక యెమెన్‌కు వెళ్లిపోయింది. 

Also Read: భారత్ పై 'నాన్ వెజ్' పాల కుట్ర.. ట్రంప్ ప్లాన్ ను తిప్పికొట్టిన భారత్!

నిమిష భర్త, కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు. దీన్ని ఆసరగా చేసుకొని మెహది.. నిమిష ప్రియ నుంచి డబ్బు లాక్కునేవాడని, వేధించేవాడని ఆమె కుటుంబం ఆరోపించింది. ఆఖరికి ఆమె పాస్‌పోర్టును కూడా లాక్కున్నాడని చెప్పారు. దీంతో నిమిష.. తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకునేందుకు 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చింది. కానీ డోస్‌ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్‌ట్యాంక్‌లో పడేసింది. చివరికి ఆమె సౌదీకి వెళ్తుండగా.. సరిహద్దుల్లో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించింది. 

అయితే మృతుడి ఫ్యామిలీకి కొంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తే దోషులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్‌లో ఉంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నిమిష ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే రూ.8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  

Also Read: జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఇవే

Advertisment
Advertisment
తాజా కథనాలు