Fire Accident: కొంపముంచిన దోమల చక్రం.. అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం: ఆరుగురు విద్యార్థులు!
దోమల బెడద నివారణ కోసం పెట్టిన దోమలచక్రం కొంపముంచింది. చక్రానికి ఉన్న నిప్పు పరుపులకు అంటుకొని అనాథాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గన్నవరం శివారులోని రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోమ్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి.