HYD Rains: మళ్లీ స్టార్ట్.. హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో హైలర్ట్!

హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాబోయే 3 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

New Update
HYD Rains

HYD Rains

హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం (Heavy Rain) కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన ఈ భారీ వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం (Waterlogging) అయ్యాయి. 

కుండపోత వర్షం:

అనేక చోట్ల మోకాల్లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. రాబోయే 3 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ (GHMC) వెంటనే రంగంలోకి దిగింది. నీటిని తొలగించడానికి సహాయక చర్యలు చేపట్టడానికి జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ (DRF) మరియు హైడ్రా బృందాలు చర్యలు చేపడుతున్నాయి. 

ఇది కూడా చదవండి: గుండెపోటుతో లండన్‌లో తెలంగాణ యువకుడి మృతి

ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా వర్షంతోపాటు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు (Gale Winds) వీచే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని 28 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ (Orange Alert)ను జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం!

Advertisment
తాజా కథనాలు