Telangana Rains: ఆ 9 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

New Update
Telangana Heavy Rains

తెలంగాణలో భారీ వ‌ర్షాల(telangana-rains) హెచ్చరికల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. శనివారం ఉదయం భారీ వర్షాలపై ఉన్నతాధకారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్‌, జయశంకర్, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. 15 జిల్లాల్లో అధిక వర్షాపాత, మిగ‌తా జిల్లాల్లో సాధార‌ణ వర్షం న‌మోదైంద‌ని సీఎం తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో SDRF‌, NDRF బృందాలను ముందుగానే మొహరించాలని సీఎం ఆదేశించారు. ఆయా బృందాలు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు.

ఇది కూడా చదవండి:TungaBhadra : తుంగ భద్రకు పొంచి ఉన్న ముప్పు?.. పనిచేయని గేట్లు..

Telangana Rains - Revanth Reddy Orders Officials

రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నీటి పారుదలశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. నీటి మట్టా్న్ని అంచనా వేస్తూ తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. నీటిని కిందకు విడుదల చేయాల్సి వస్తే ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందితో పాటు ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. నిండిన  చెరువులు, రిజర్వాయర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇసుక బస్తాలను ముందుగానే ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు. రోడ్లపై వరద నీరు ఉంటే ముందుగానే గమనించి రాకపోకలు నిలిపివేయాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆయా రోడ్లపై ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.

వర్షపు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందన్నారు. న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నగరంలో అధికారులు ఇంకా అలర్ట్ గా ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది ప్రజల నుంచి వచ్చే వినతుల సత్వర పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. 

Also Read :   ఏం మనిషివిరా... ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి ఆపై..

Advertisment
తాజా కథనాలు