Heavy Rains: ఈ 15 జిల్లాల్లో అతి భారీ వర్షం.. అన్నీ శాఖలని సీఎం అప్రమత్తం

రాష్ట్రంలో 15 జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారనుంది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది.

New Update
heavy rains

రాష్ట్రంలో 15 జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నట్లు వాతావరణ శాఖ(imd) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారనుంది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు అధికారులు ‘ఆరెంజ్‌’ అలర్ట్ జారీ చేశారు.

Also Read :  హైదరాబాద్‌‌లో దంచికొడుతున్న వర్షం.. మరో మూడు రోజులు వానలే

Heavy Rains In Telangana State

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాసర వద్ద గోదావరిలో వరద నీరు ఉప్పొంగుతోంది. నది నుంచి ఆలయానికి వెళ్లే మార్గం పూర్తిగా మునిగిపోయింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హైచ్చరికపై శాఖలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. ‘‘అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలి. అన్ని చెరువు కట్టలను పరిశీలించాలి. వరద నీరు నిలిచే రోడ్లను గుర్తించి.. ముందస్తుగా వాహనాలను నిలిపివేయాలి. విద్యుత్‌ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంతరాయం లేకుండా కరెంట్‌ సరఫరా చేపట్టాలి’’ అని సీఎం ఆదేశించారు. 

Also Read :  రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు

Advertisment
తాజా కథనాలు