/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
TG Rains: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read : తులం బంగారం కోసం వేధించారు..పెళ్లైన నాలుగోరోజే నవవధువు సూసైడ్
Also Read : పోలీస్ స్టేషన్ల లేక సెటిల్‌మెంట్ల అడ్డాలా? హైకోర్టు ఆగ్రహం!
6.10 సెం.మీ వర్షపాతం
బుధ, గురువారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని తెలిపింది. ఈ మేరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు గంటకు 30నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 6.10 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Also Read : ఛీ వీడూ తండ్రేనా.. టైమ్‌కు నిద్ర పోవడంలేదని చిన్నారికి నరకం
Also Read : వారికి ప్రతి నెలా రూ.4 లక్షలు ఇవ్వండి.. షమీకి హైకోర్టు ఆదేశాలు!
Heavy Rains | latest telangana news | telangana news today | telangana-news-updates | telangana weather news | telangana weather updates | telangana weather report today | telugu-news | today-news-in-telugu