Rain Alert: తెలంగాణలో రెండురోజులు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, హనుమకొండ, జనగామ, వరంగల్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

New Update
telangana heavy rains

తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం (ఆగస్ట్ 12)న భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌, హనుమకొండ, మహబూబ్‌నగర్‌, జనగామ, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే వీలుందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. 

తెలంగాణలోని పలు చోట్ల బుధవారం అత్యంత భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, హనుమకొండ, జనగామ, వరంగల్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంటూ వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాక నిపుణులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు