Heavy Rains: వర్షాలకు అతలాకుతలం అవుతున్న కామారెడ్డి.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు కామరెడ్డి మునిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు కామరెడ్డిలోని రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
Floods: భయంకరమైన వరదలు.. నలుగురు మృతి
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భయంకరమైన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డోడా జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ వల్ల నలుగురు మృతి చెందడం కలకలం రేపింది. కఠువా, కిశ్త్‌వాడ్‌లో కూడా వరదలు సంభవించాయి.
India Sent Flood Alert To Pakistan | పాక్‌ను కాపాడిన ఇండియా | Ind-Pak Torrential rains | RTV
Pakistan Floods: పాకిస్తాన్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 365కు పెరిగిన మృతుల సంఖ్య!
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తంఖ్వా రాష్ట్రంలో ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షాలకు ఇప్పటి వరకు 365 మంది మృతి చెందారు. కేవలం బునేర్ జిల్లాలో దాదాపుగా 225 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కూలిపోయాయి.
MUMBAI MONO METRO : ముంబైలో మొరాయించిన మోనో మెట్రో..రైల్లోనే ప్రయాణీకులు
ముంబయిని వానలు ముంచేత్తాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో ముంబై జలమయమైంది. ఈ వర్షాల మూలంగా మోనో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మోనో మెట్రో రైలు మొరాయించింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో మోనో మెట్రో రైలు ఆగిపోయింది.
ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తిన వరద.. | Huge Water Inflow To Prakasam Barrage | Heavy Rains | RTV
Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
దేశవ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 12 గంటల్లో అది వాయుగుండగా మారే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.