Hyderabad: ఉప్పొంగిన మూసీ... మునిగిన ఎంజీబీఎస్

హైదరాబాద్ ను నిన్న రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. చంచల్ గూడ, రాజేంద్రనగర్, బండ్ల గూడ జాగీర్, నార్సింగి లలో కురిసన వర్షంతో జంట జలాశయాల గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీనది హైదరాబాద్ నగరం మధ్యలోకి వచ్చేసింది. 

New Update
musi river

హైదరాబాద్(hyderabad) లో ఎగువను వర్సాలు కురిస్తే... దిగువ ప్రాంతాలకు ముప్పు తప్పదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. చంచల్ గూడ, రాజేంద్రనగర్, బండ్లగూడజాగీర్, నార్సింగి: ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదిలేశారు. దీంతో మూసీ నీరు(musi-river) అంతా వచ్చి హైదరాబాద్ మధ్యలోకి చేరింది. నిన్న ఇది మహోగ్ర రూపం దాల్చింది. చాదర్ ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. దీంతో ఎంజీబీఎస్ అంతా నీటిలో మునిగిపోయింది. మూసీ నీరు బస్టాండ్ లోకి భారీగా చేరింది. దీని కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి.  వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. 

Also Read :  తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ..  పోలీసు కమిషనర్‌గా సజ్జనార్‌

మూసీ దిగువ ప్రాంతాల్లో భారీగా వరద నీరు..

మూసీ వరద కారణంగా హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు రోజూ భారీ వర్షాలు(Heavy Rains) పడుతున్నాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండూ నిండుకుండల్లా ఉన్నాయి. గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకూ ఎగువను వర్సాలు కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి. దీంతో జంటజలాశయాల్లో మరింత ప్రవాహం పెరిగింది. దీంతో 13,500 క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి 8 గంటల తర్వాత 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో మూసీ పొడవునా భయాందోళనలు నెలకొన్నాయి. నిర్మాణంలో ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జి...దాని సామాను కొట్టుకుపోయాయి. 

వరద ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాతలకు తరలించాలని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అలాగే ఎంజీబీఎస్ లో చిక్కుకున్న ప్రయాణికులను కూడా అక్కడి నుంచి బయటకు తీసుకురావలని చెప్పారు. మరోవైపు హైటెక్ సిటీ రోడ్లలో కూడా నీరు నిలిచిపోయింది. దీనిని బల్దియా అధికారులు మోటార్లతో తోడి పోస్తున్నారు. కుల్సుంపుర నుంచి పురానాపూల్ వరకు, చాదర్ఘాట్ కాజ్ వే  వంతెన, మూసారాంబాగ్ బ్రిడ్జి వరకు రహదారులను పూర్తిగా మూసివేసి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  అలాగే మూసీకి ఇరువైపులా ఉన్న పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. దాంతో పాటూ మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, శంకర్ పల్లి, గండిపేట మండలాలకు చెందిన రైతుల పంటలన్నీ వరదలో చిక్కుకుపోయాయి.  

Also Read :  తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ  రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు

Advertisment
తాజా కథనాలు