/rtv/media/media_files/2025/10/05/darjeeling-2025-10-05-10-43-48.jpg)
Darjeeling land slides
పశ్చిమ బెంగాల్(west bengal) లోని డార్జిలింగ్ జిల్లాలో భారీ వర్షాలు(Heavy Rains), కొండచరియలు(landslide) విరిగిపడటంతో ఆదివారం (అక్టోబర్ 5, 2025) ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరిక్ ప్రాంతంలో సంభవించిన కొండచరియల బీభత్సంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తు కారణంగా మీరిక్, కుర్సెంగ్‌లను కలిపే దుధియా బ్రిడ్జ్ కూలిపోవడంతో ఆ ప్రాంతంలో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. గత కొన్ని రోజులుగా డార్జిలింగ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలే ఈ విపత్తుకు కారణమని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ డార్జిలింగ్, కాలింపాంగ్, జల్పాయిగురి, కూచ్‌బెహర్ మరియు అలిపుర్‌ద్వార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read : ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండింగ్‌లో తెరుచుకున్న ఎమర్జెన్సీ ఇంజన్
Dudhia Bridge Collapse In Darjeeling
Bridge Collapse in Dudhia:
— Kamalika Sengupta (@KamalikaSengupt) October 5, 2025
Continuous overnight rainfall led to the collapse of the iron bridge connecting Siliguri and Mirik over the Balason River at Dudhia.#NorthBengal#Dudhia#Rain#mirikpic.twitter.com/KcGJJh9Dt1
మీరిక్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతి చెందగా, దీంతో మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిలిగురి, -మీరిక్ మధ్య ప్రధాన రహదారిపై బాలాసన్ నదిపై దుధియా వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కుర్సెంగ్‌కు సమీపంలో NH-110 వెంబడి హుస్సేన్ ఖోలా వద్ద కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెడాంగ్, రిషీఖోలా మధ్య ఉన్న కీలకమైన జాతీయ రహదారి 717 కూడా కొండచరియలు విరిగిపడటంతో పూర్తిగా మూసుకుపోయింది. దీంతో సిలిగురి, సిక్కిం మధ్య రోడ్డు మార్గ స్తంభించిపోయింది.
విపత్తు సంభవించిన ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం, విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్టా ఈ ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాల్లో భారీ నష్టం జరిగిందని, మరణాలు సంభవించాయని, ఆస్తి నష్టంతో పాటు మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రభావిత ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు అధికారులతో సంప్రదిస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.
Also Read : వాహనదారులకు కేంద్రం బిగ్‌షాక్.. ఐదుకు మించి చలాన్లు ఉంటే లైసెన్స్ రద్దు