Weather Update: బిగ్ అలర్ట్.. ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, చలి!

ఈశాన్య రుతుపవనాల వల్ల ఏపీకు నేడు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

New Update
rains

Rains

ఈశాన్య రుతుపవనాల వల్ల ఏపీకు నేడు భారీ వర్ష(Heavy Rains) సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో అయితే రోజంతా వర్షం పడదని, ఎండ వాతావరణం ఉంటుందని వెల్లడించారు. అలాగే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాల వల్ల తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇది కూడా చూడండి: Komatireddy Rajagopal Reddy : కొండా సురేఖ వివాదం వేళ.. కాంగ్రెస్ పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇది కూడా చూడండి: HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?

తెలంగాణలో ఈ జిల్లాల్లో..

తెలంగాణలో హన్మకొండ, వరంగల్, జనగాం, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వనపర్తి,హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్(Weather Update) జారీ చేశారు. 

Advertisment
తాజా కథనాలు