Hyd Musi River: మూసీ ఉగ్రరూపం.. హైదరాబాద్‌కు పొంచి ఉన్న ప్రమాదం.. డేంజర్‌ జోన్‌లో ఈ ఏరియాలు!

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసీ నది ఉప్పొంగుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. మూసీ నది ఉగ్రరూపం వల్ల చాదర్‌ఘాట్, ఎంజీబస్ స్టేషన్, మలక్ పేట్, అఫ్జల్ గంజ్‌, పాతబస్తీ డేంజర్‌లో ఉన్నాయి.

New Update
musi river

musi river

గత రెండు రోజుల నుంచి హైదరాబాద్‌(hyderabad) లో కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy Rains) మూసీ నది(Moosi River) ఉప్పొంగుతుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తడం వల్ల మూసీ నది ఉప్పొంగుతుంది. దీని కారణంగా నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. మూసీ నది(musi-river) ఉగ్రరూపం వల్ల చాదర్‌ఘాట్ వంతెన దగ్గర భారీగా నీరు  ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి రాకపోకలు ప్రారంభించడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో వరద నీరు ప్రజల ఇళ్లలోకి చేరుతుంది. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎంజీబీఎస్, మలక్ పేట, ముసరాంబాఘ్ ఏరియాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. మసన్ ఘాట్, ధోబీ ఘాట్ పాత వంతెన నదికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలు నీటి మట్టం పెరిగింది. ఇలానే కొనసాగితే మునిగిపోయే అవకాశం ఉంది. లోతట్టు కాలనీల నుంచి ప్రజలను జీహెచ్‌ఎంసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మూసీ నది వల్ల అఫ్జల్‌గంజ్ లోని కోల్సావాడి, ఘన్సీ బజార్, అల్-జుబైల్ కాలనీ, ఉస్మాన్ నగర్, పాతబస్తీలు డేంజర్ జోన్‌లో ఉన్నాయని అధికారులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్‌, ఉస్మాన్ సాగర్!

భారీగా వరద నీరు..

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండిపోయి గేట్లు ఎత్తినప్పుడు ఆ నీరంతా దిగువనున్న ప్రాంతాల్లోకి చేరుతుంది. దీంతో ఎక్కడ చూసినా నీరు కనిపిస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే కొన్ని మునిగిపోయాయి. అంబర్‌పేట్, దిల్ సుఖ్ నగర్ ఏరియాకు రాకపోకలు ఆగిపోయాయి. భారీగా మూసీ వరద నీరు ప్రవహించడంతో బిల్డింగ్‌లు కొట్టుకుపోతున్నాయి. అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మరికొందరు ఈ వరదల్లో చిక్కుకుంటున్నారు. మరికొందరు ఈ మూసీ నది వల్ల హైదరాబాద్‌కు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ  రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు

Advertisment
తాజా కథనాలు