Weather Update: డేంజర్.. మరో రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి 13వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

New Update
Hyderabad Heavy Rains

Hyderabad Heavy Rains

బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఆవర్తనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి 13వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. రాయలసీమలోనూ నేడు చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు ఏపీ, తెలంగాణ సహా దక్షిణ భారతదేశంలో నాలుగైదు రోజులు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇది కూడా చూడండి: Israel-Hamas Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ శాంతి ఒప్పందం.. యుద్ధం ముగిసినట్లేనా ?

తెలంగాణలో ఈ జిల్లాల్లో

నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, నిజమాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, ఖమ్మంలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇకపోతే హైదరాబాద్‌లో మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, యూసఫ్‌గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతి నగర్, మియాపూర్, బేగంపేట, ప్రకాష్ నగర్, రసూల్‌పూర, బోరబండ, మూసాపేట, భరత్ నగర్ ఇలా నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఏపీలో ఈ జిల్లాల్లో..

ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చూడండి: Hydra: బసవతారకం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..రూ. 750 కోట్ల భూమికి హైడ్రా విముక్తి

Advertisment
తాజా కథనాలు