Telangana News : గెరువిచ్చిన వాన..తేరుకున్న ఎంజీబీఎస్‌..రాకపోకలు షురూ

ఈ రోజు నగరంలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఎంజీబీఎస్ వరద నుంచి తేరుకుంది. బస్టాండ్‌కు వచ్చే మార్గంలోని శివాజీ బ్రిడ్జి, ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాం 56, 58, 60 వద్ద పేరుకుపోయిన బురదను శుభ్రం చేశారు.  ప్రస్తుతం బస్సు సర్వీసులు ఎంజీబీఎస్‌ నుంచే ప్రారంభించారు.

New Update
MGBS Bus Stand

MGBS Bus Stand

Telangana News : గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ అతలాకుతలం అయింది. మూసీనదికి వరద పోటెత్తడంతో మూసీ పరివాహక ప్రాంతంతో పాటు ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ కూడా నీటమునిగింది. దీంతో ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ ను మూసివేసి ప్రయాణీకులకు ఇతర ప్రాంతాలనుంచి బస్సులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం నుంచి వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో మూసీ నదికి వరద ఉద్ధృతి తగ్గింది. దీంతో ఎంజీబీఎస్ వరద నుంచి తేరుకుంది.బస్టాండ్‌కు వచ్చే మార్గంలోని శివాజీ బ్రిడ్జి, ఎంజీబీఎస్‌లోని ప్లాట్‌ఫాం 56, 58, 60 వద్ద బురద భారీగా పేరుకుపోవడంతో  దీన్ని తొలగించేందుకు ఆర్టీసీ సిబ్బంది శ్రమించి బురదను శుభ్రం చేశారు. 

ఇది కూడా చూడండి: TG News: హైదరాబాద్‌లో పోకిరీల అరాచకం.. పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్‌ను ఆపి.. కాళ్లు మొక్కించుకుని..!

నిన్న మొత్తం ఎంజీబీఎస్‌ నిండా వరద నిండిపోవడంతో పలు ప్రాంతాల నుంచి జిల్లాలకు ఆర్టీసీ.. బస్సులు నడిపింది. ప్రయాణికులు పికప్‌ పాయింట్ల వద్దకు వెళ్లాలని ఆర్టీసీ సిబ్బంది సూచించారు. ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, జేబీఎస్‌ నుంచి జిల్లాలకు బస్సులు నడిపింది. వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఎంజీబీఎస్‌ ద్వారా బస్సుల రాకపోకలు తిరిగి ప్రారంభించింది యాజమాన్యం. ప్రస్తుతం బస్సు సర్వీసులు ఎంజీబీఎస్‌ నుంచే ప్రారంభించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ నుంచి కలిపి 4,847 క్యూసెక్కుల నీటిని అధికారులు మూసీలోకి విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రి అత్యధికంగా జంట జలాశయాల నుంచి 36 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గడంతో.. అవుట్ ఫ్లోను అధికారులు తగ్గించారు. ఇప్పటికీ ఉస్మాన్ సాగర్‌కు 1100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఇక్కడి నుంచి 884 క్యూసెక్కుల నీటిని మూసీ నదికి విడుదల చేస్తున్నారు. మరో వైపు హిమాయత్ సాగర్‌కు 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి 3,963 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి విడుదలవుతున్న అవుట్ ఫ్లో తగ్గడంతో మూసీ పరివాహక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరద మూలంగా ఇళ్లలోకి చేరిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Raipur Steel Plant Collapses: కుప్పకూలిన స్టీల్ ప్లాంట్.. ఐదుగురు కార్మికుల దుర్మరణం!

Advertisment
తాజా కథనాలు