Heavy Rains: భారీ వర్షం, పిడుగుపాటు.. 10 మంది మృతి

బీహార్‌లో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటు కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
bihar

బీహార్‌(bihar) లో భారీ వర్షాలు(Heavy Rains), పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు కొనసాగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటు కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటించింది.

నలంద జిల్లాలో ఇద్దరు చనిపోగా, వైశాలి, భాగల్‌పూర్, సహర్స, రోహ్‌తాస్, సరన్, జమూయి, భోజ్‌పూర్, గోపాల్‌గంజ్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. 

Also Read :  వాహనదారులకు కేంద్రం బిగ్‌షాక్.. ఐదుకు మించి చలాన్లు ఉంటే లైసెన్స్ రద్దు

దాదాపు 40 మందికి పైగా

సుపాల్, ఖగారియా, నలంద వంటి ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది.  ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విపత్తు నిర్వహణ విభాగం సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గత రెండు వారాల్లో రాష్ట్రంలో పిడుగుపాటుకు దాదాపు 40 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఈ సీజన్‌లో పిడుగులు పడటం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read :  కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. కేజ్రీవాల్ కీలక ప్రకటన!

భారత వాతావరణ శాఖ (IMD) అందించిన అంచనాల ప్రకారం, బీహార్‌లో ఈరోజు (అక్టోబర్ 5) వాతావరణ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది, కానీ రేపు (అక్టోబర్ 6) అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర బీహార్ పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీని అనుబంధ తుఫాను ప్రసరణ కూడా బలహీనపడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు