Bhutan Floods: భూటాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్.. వేలాది మంది వరదల్లో?

గత కొన్ని రోజుల నుంచి భూటాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల వల్ల వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఎంత మంది చనిపోయారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Bhutan floods

Bhutan floods

గత కొన్ని రోజుల నుంచి భూటాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన ఈ వరదల వల్ల వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఎంత మంది చనిపోయారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే భారీ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు కొట్టుకునిపోయాయి. ఇక బ్రిడ్జ్‌లు కొట్టుకునిపోవడంతో కొన్ని గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

ఇది కూడా చూడండి: Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 60 మంది మృతి

వరదల్లో చిక్కుకున్న ప్రజలు..

ఈ వరదల్లో చిక్కుకున్న వారిని భూటాన్ అధికారులతో పాటు భారత సైనికులు సహాయక చర్యలు చేపట్టారు. వరదల కారణంగా చిక్కుకున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే భూటాన్ హెలికాప్టర్ పనిచేయకపోవడంతో భారత్‌కు అత్యవసరం సహాయం కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భారత సైన్యం వెంటనే స్పందించి వరదల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా రక్షించింది. 

ఇది కూడా చూడండి: Dudhia Bridge: డార్జిలింగ్‌లో బీభత్సం.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్.. ఆరుగురు మృతి

Advertisment
తాజా కథనాలు