Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 60 మంది మృతి

నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.

New Update
Rain-triggered landslides, floods kill at least 63 in Nepal, India

Rain-triggered landslides, floods kill at least 63 in Nepal, India

నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు. మొత్తంగా వరదల ప్రభావానికి 60 మంది మృతి చెందినట్లు ఆదివారం అధికారులు వెల్లడించాయి. శుక్రవారం నుంచి నేపాల్‌లో భారీ వర్షాలు కురవడంతో నదులు ఉప్పొంగుతున్నాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి, మరికొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. 

Also Read: బతుకమ్మ ఆడుతూ కుప్పకూలిన నవ వధువు.. హాస్పటల్ కు వెళ్తే షాకింగ్ న్యూస్!

నేపాల్‌లోని ఇలాం జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఏకంగా 37 మంది చెందారు. రాత్రి భారీగా వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని అక్కడి జిల్లా అధికారి సునీతా నేపాల్ తెలిపారు. అనేక రోడ్లు బ్లాక్ అయ్యాయని.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాజధాని ఖట్మాండ్‌లో కూడా వర్షాల ధాటికి నదులు పొంగిపోర్లుతున్నాయి. అక్కడి స్థానికులను భద్రతా సిబ్బంది హెలికాప్టర్లు, మోటార్ బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Also Read: ఇన్సూరెన్స్ డబ్బులకోసం దారుణం..వ్యక్తిని చంపి భార్యగా నమ్మించి...ట్విస్ట్ ఏంటంటే?

ఇక నేపాల్ సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో వరదల ప్రభావానికి 20 మంది మృతి చెందారు. రాత్రి భారీగా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ కూడా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

Advertisment
తాజా కథనాలు