Cyber Crime: అమెజాన్‌లో ఆర్డర్.. రూ.లక్ష మోసపోయిన వృద్ధురాలు
అమెజాన్‌లో కొన్న వస్తువును తిరిగి అప్పగించేందుకు యత్నించిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె నుంచి వాళ్లు ఏకంగా రూ.1.07 లక్షలు కాజేశారు.
అమెజాన్‌లో కొన్న వస్తువును తిరిగి అప్పగించేందుకు యత్నించిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె నుంచి వాళ్లు ఏకంగా రూ.1.07 లక్షలు కాజేశారు.
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. పీఎం కిసాన్ యోజన నకిలీ యాప్ లింకు పంపి.. రూ.10 లక్షల నగదు కాజేశారు.ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన రాజాశెట్టి తిరుపతిలోని ఓ గోల్డ్ షోరూమ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన 77ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. మనీలాండరింగ్ జరిగిందని, అరెస్టు వారెంటీ జారీ చేశామని చెప్పడంతో రూ.53లక్షలు పంపించేశాడు. వెంటనే కేటుగాళ్లు కాల్ కట్ చేసి పత్తా లేకుండా పోయారు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
దేశంలో విద్యార్థులందరికీ కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందని చెబుతూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఎక్స్‌లో స్పష్టం చేసింది.
ఆమె అతన్ని ప్రేమించింది. కానీ, అతడు ఆమె ప్రేమను అంగీకరించలేదు. అంతేకాదు ఆమెను కాదని మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. దానికోసం దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులకు పాల్పడింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయింది.
తాజాగా BSNL సిమ్ వినియోగించే కస్టమర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. వారికికి ఓ ఫేక్ మెసేజ్ పంపించారు. ఇందులో కస్టమర్ల కేవైసీ ట్రాయ్ నిలిచిపోతుందని.. 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందంటూ తప్పుడు సందేశం పంపిస్తున్నారు.
మోసం జరిగింది కర్ణాటకలో..కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుతో. కర్ణాటకలో హవేరీలో ట్రంప్ యాప్ పేరుతో కోట్లాది రూపాయలకు టోకరా వేశారు. తరువాత ఆ భారీ మొత్తంతో పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన మహిళకు వీడియోకాల్ చేసి బెదిరించిన కేటుగాళ్లు రూ.26 లక్షలు కాజేశారు. బాధిత మహిళ అకౌంట్ నుంచి ఇల్లీగల్ లావాదేవీలు జరిగాయని బెదిరింపులకు దిగారు. సదరు మహిళను అరెస్ట్ చేస్తామని భయపెట్టి విడతల వారిగా రూ. 26 లక్షల 50 వేలు కొట్టేశారు.
చంపాపేటకు చెందిన 57 ఏళ్ల గృహిణి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.2.7 కోట్లు పోగొట్టుకుంది. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులుగా నటిస్తూ ఆమెనుంచి డబ్బులు కాజేశారు. సంస్థాగత స్టాక్‌లలో పెట్టుబడి పెట్టమని ఒప్పించి పెద్దమొత్తంలో దోచుకున్నారు.