Cheating: పెళ్లి పేరుతో మోసం.. టీచర్‌ కు రూ.2.5 కోట్లు కుచ్చుటోపి

బెంగళూరుకు చెందిన ఒక ఒంటరి మహిళ పెళ్లికోసం చేసిన ప్రయత్నాలు ఆమెను నిండా ముంచాయి. కోట్ల రూపాయలు కాజేసిన నిందితుడి కోసం ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. మాయమాటలతో రూ.2.5 కోట్ల తన ఖాతాలోకి మళ్లించుకుని మోసగించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

New Update
Cybercrime Coordination Center

Cybercrime

 Cheating:   బెంగళూరుకు చెందిన ఒక ఒంటరి మహిళ పెళ్లికోసం చేసిన ప్రయత్నాలు ఆమెను నిండా ముంచాయి. కోట్ల రూపాయలు కాజేసిన నిందితుడి కోసం ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన ఓ మహిళ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. అయితే కొంతకాలం క్రితం ఆమె భర్త మరణించాడు. పిల్లలు లేకపోవడంతో కొంతకాలం ఒంటిరిగానే గడిపిన ఆమె తిరిగి పెళ్లి చేసుకోవాలనుకుంది. అందులో భాగంగా 2019లో ఒక మ్యాట్రిమోనీ సైట్‌ తన వివరాలు పొందుపరిచింది. ఆ సమయంలో అదే సైట్‌లో ఆకాశ్‌కుమార్‌ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని సంప్రదించాడు. ‘నేనూ భారతీయుడినే. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నా. ఓ ఇజ్రాయిల్‌ కంపెనీలో ఇంజినీరుగా పని చేస్తున్నా’ అంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకూడా నమ్మింది.


కొంతకాలం పాటు ఇద్దరి మధ్య పోన్ కాల్స్‌, చాటింగ్‌లు బాగానే నడిచాయి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ఏడాది గడిచింది.  ఆ మరుసటి సంవత్సరం.. 2020లో తనకు వేతనం రాలేదంటూ కొంత సొమ్ము కావాలని ఆకాశ్‌ ఆమెను నమ్మించాడు. నిజమేనని నమ్మింది. ఎలాగు పెళ్లి చేసుకునేవాడే కదా అని ఆమె మనసు కరిగి కొంత నగదు జమా చేసింది. ఇలా  గత నాలుగేళ్లుగా నమ్మించి ఆమె నుంచి  రూ.2.5 కోట్లు తీసుకున్నాడు. అయితే 2024 నవంబరు నుంచి అతనికి డబ్బు ఇవ్వడం ఆపేసింది. అంతే అటు నుంచి అతని ఫోన్‌ ఆగిపోయింది. దీంతో తాను మోసాపోయానని గుర్తించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. మాయమాటలతో రూ.2.5 కోట్ల తన ఖాతాలోకి మళ్లించుకుని మోసగించాడని బాధితురాలు పోలీసు ఠాణా మెట్లెక్కారు. ఆ మొత్తాన్ని గత నాలుగేళ్లుగా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడని నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Bigg Boss Promo: రేలంగి మావయ్య బయటకొచ్చాడు.. భరణికి ఇచ్చి పడేసిన శ్రీజ..! హై వోల్టేజ్ ఎపిసోడ్

Advertisment
తాజా కథనాలు