/rtv/media/media_files/2025/10/07/online-game-2025-10-07-07-42-02.jpg)
Online game
నేటి డిజిటల్ యుగంలో పిల్లలు చిన్న వయసులోనే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవుతున్నారు. అయితే వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) సులభంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లు(online-game), సోషల్ మీడియా వేదికల ద్వారా పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, డబ్బు దోచుకోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం లేదా మానసిక వేధింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె నితారా (13) ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను అశ్లీల చిత్రాలు పంపమని కోరాడు. నితారా వెంటనే తన తల్లికి చెప్పడంతో ప్రమాదం తప్పింది. అయితే ఇలాంటి ఘోరాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆన్‌లైన్ గేమ్ ఉచ్చులో పడి ఒక ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. ఆ విద్యార్థి సైబర్ నేరగాడికి తన తండ్రి ఖాతా నుంచి రూ.14 లక్షలు బదిలీ చేసి.. పట్టుబడతాననే భయంతో ఈ దారుణ చర్యకు పాల్పడ్డాడు.
పిల్లల భద్రతకు తల్లిదండ్రుల సూచనలు:
సైబర్ నేరాల(Cyber ​​Crime) నుంచి పిల్లలను రక్షించుకోవడానికి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. ఇంటర్నెట్, ఆన్‌లైన్ గేమ్‌ల లాభనష్టాల గురించి పిల్లలకు వివరించాలని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సైబర్‌క్రైమ్ పోర్టల్ (National Cybercrime Portal) ను సందర్శించి మీరు కూడా సైబర్ నేరాలపై సమాచారం తెలుసుకోవాలి. అంతేకాకుండా పిల్లలు ఆన్‌లైన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సైట్‌లను చూస్తున్నారో తెలుసుకోవాలి. వారి ప్రవర్తనలో ఆకస్మిక మార్పులను గమనిస్తే.. వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను తప్పకుండా తనిఖీ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో దారుణం.. అలా చేస్తోందని అత్తను కొట్టి చంపిన కోడలు!
పిల్లలు ఇంటర్నెట్‌ను ఉపయోగించే సమయాన్ని, వారు యాక్సెస్ చేయగలిగే వెబ్‌సైట్‌లను నియంత్రించాలి. పేరెంటల్ కంట్రోల్స్ (Parental Controls) సెట్టింగ్‌లను ఉపయోగించి అవాంఛిత కంటెంట్‌ను నిరోధించాలి. తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వవద్దని పిల్లలకు నేర్పండి. బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించేందుకు సహాయం చేయాలి. పిల్లలు సైబర్ నేరానికి గురైతే.. ఆ విషయాన్ని దాచకుండా.. వెంటనే వారిని నమ్మకంలోకి తీసుకుని, స్క్రీన్‌షాట్లు లేదా లింక్‌లతో సహా పోలీసులకు లేదా నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సెలబ్రిటీల మోజులో పడితే.. ఆస్పత్రిలో బెడ్ ఎక్కాల్సిందే.. ఇదిగో ప్రూఫ్