Cyber Crime: సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5489 కోట్లు స్వాధీనం..

సైబర్ నేరగాళ్ల నుంచి ఇప్పటిదాకా రూ.5,489 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ సొమ్మును బాధితులకు రీఫండ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
5489 Crores Recovered From Cyber Criminals

RS.5,489 Crores Recovered From Cyber Criminals

ఈమధ్యకాలంలో చాలామంది సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి వేలు, లక్షలు, కోట్లు పోగోట్టుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక విషయం వెల్లడించింది. సైబర్ నేరగాళ్ల నుంచి ఇప్పటిదాకా రూ.5,489 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ సొమ్మును బాధితులకు రీఫండ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సైబర్‌ కమాండో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు.  

Also read: 18 ఏళ్లు దాటిన వారికే పో*ర్న్ సైట్స్‌ యాక్సెస్‌.. కట్‌ చేస్తే ఊహించని ఫలితం

ఇక వివరాల్లోకి వెళ్తే న్యూ ఢిల్లీలో బండి సంజయ్.. సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (CIS) కార్యకలాపాలను సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఇండియన్ సైబర్‌ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్(I4C) గురించి ఆయన వివరించారు. సైబర్‌ నేరాలను ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారం ఉండేలా I4C పనిచేస్తోందని చెప్పారు. సైబర్‌ మోసాలను అరికట్టేందుకు తాము తీసుకున్న చర్యల గురించి కూడా అధికారులు బండి సంజయ్‌కు వివరించారు.  బాధితుల నుంచి ఇప్పటిదాకా రూ.5489 కోట్లు స్వాధీనం చేసుకున్నామని.. అలాగే12 లక్షలకు పైగా మైబెల్‌ హ్యాండ్‌ సెట్లు, సిమ్‌లు బ్లాక్‌ చేశామని చెప్పారు. అంతేకాదు రూ.4,631 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీలు అడ్డుకున్నామని తెలిపారు. సైబర్ నేరగాల్లు వాడే 13.3 లక్షల మ్యూల్ ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. 

Also Read: ఖరీదైన వినాయకుడు...గణపయ్యకు రూ.474 కోట్ల ఇన్సూరెన్స్‌

సైబర్‌ క్రైమ్‌ గురించి సోషల్ మీడియా, మీడియా, రేడియోలో ప్రజలకు అవగాహన కార్యక్రమలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 1930 పేరుతో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్‌ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్‌ హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులను టార్గెట్‌ చేసుకొని ఆన్‌లైన్ నేరాలు జరుగుతున్నాయని.. ఇందుకోసం సహాయక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే సైబర్‌ మోసాలపై అవగాహన పెంచేందుకు హెల్ప్‌లైన్ 1930,  cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేసేందుకు స్థానిక భాషల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

Also Read: అటు రష్యా.. ఇటు ట్రంప్.. మధ్యలో నలిగిపోతున్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే!?

ఇక ఎన్‌సీఆర్‌పీలో నమోదయ్యే సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీలో ఉన్నట్లుగానే ఈజీరో ఎఫ్‌ఐఆర్ విధాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు. ఇదిలాఉండగా ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అమాయకులను వలలో వేసుకొని డబ్బులు దండుకునేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేసిస్తున్నారు. ఈ మధ్య డిజిటల్ అరెస్టు కేసులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. చదవుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్లకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అందరీ మొబైల్‌ ఫోన్‌లలో కూడా ఎవరికైనా కాల్‌ చేసేటప్పుడు సైబర్‌ క్రైమ్‌ గురించి అవగాహన కల్పిస్తున్నారు.  

Also Read: జెలెన్స్కీకి ట్రంప్ బిగ్ షాక్.. ఉక్రెయిన్‌ అందులో చేరవద్దని సీరియస్ వార్నింగ్!

Advertisment
తాజా కథనాలు