Akshay Kumar Daughter: ‘నీ నగ్న ఫొటోలు పంపు’.. బాలీవుడ్ హీరో కూతురికి మెసేజ్‌లు

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 13 ఏళ్ల కూతురు ఆన్‌లైన్ గేమ్‌లో సైబర్ నేరగాడి వేధింపులకు గురైందని వెల్లడించారు. అపరిచితుడు ఆమెను నగ్న చిత్రాలు పంపమని అడిగాడని అన్నారు. ఇది పెరుగుతున్న సైబర్ క్రైమ్ ప్రమాదాన్ని సూచిస్తుందని తెలిపారు.

New Update
Akshay Kumar Daughter

Akshay Kumar Daughter

పిల్లల్లో సైబర్ నేరాల(Cyber ​​Crime) ప్రమాదం రోజు రోజుకూ ఆందోళన కలిగిస్తోంది. పలు ఆన్‌లైన్ గేమ్‌లు, రకరకాల సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకులైన చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పరిచయం లేని వ్యక్తులు మొదట మంచిగా మాట్లాడి పరిచయం పెంచుకుంటున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత సమాచారం, ఫోటోలు అడిగి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు. 

Also Read :  దుర్గా పూజలో హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ తాకిన వ్యక్తి.. షాకింగ్ వీడియో

Akshay Kumar Daughter

అక్షయ్ కుమార్(Akshay Kumar) తన కూతురికి ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. రోడ్లపై జరిగే నేరాల కంటే సైబర్ నేరాలే రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టాలని.. అలాగే స్కూళ్లలో సైబర్ భద్రతపై తప్పనిసరిగా విద్య అందించాలని ఆయన కోరారు. 

Also Read :  ఐశ్వర్య సంచలన నిర్ణయం... యూట్యూబ్ పై రూ.4 కోట్ల పరువునష్టం దావా

ఈ మేరకు ముంబైలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’(Cyber Awareness Month 2025) ప్రారంభోత్సవంలో అక్షయ్ కుమార్ తన 13 ఏళ్ల కూతురు విషయంలో జరిగిన సంఘటనను వివరించారు. ‘‘కొన్ని నెలల క్రితం మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా కూతురు వీడియో గేమ్ ఆడుతోంది. కొన్ని వీడియో గేమ్‌లు అపరిచితులతో కలిసి ఆడే అవకాశం ఇస్తాయి. 

మీరు గేమ్ ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు అవతలవైపు నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ‘నువ్వు బాయ్ లేదా గర్ల్?’ అని అడిగారు. దానికి నా కూతురు.. ‘అమ్మాయిని’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ‘నీ నగ్న చిత్రాలను పంపగలవా?’ అని మెసేజ్ వచ్చింది. ఆమె వెంటనే ఆ గేమ్ ఆపేసి.. జరిగిన విషయాన్ని నా భార్యకు చెప్పింది. మొదట ఇలాగే మొదలవుతాయి. ఇది కూడా సైబర్ క్రైమ్‌లో ఒక భాగమే. వీధుల్లో జరిగే నేరం కంటే ఈ సైబర్ క్రైమ్ మరింతగా పెరిగిపోతుంది. ఈ నేరాన్ని అడ్డుకోవడం చాలా ముఖ్యం. 

ఇక ఈ సంఘటన తరువాత అక్షయ్ కుమార్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఒక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 7వ, 8వ, 9వ, 10వ తరగతి స్టూడెంట్స్‌కు ప్రతి వారం ఒక ‘సైబర్ పీరియడ్’ (సైబర్ క్లాస్) ఉండాలని, అక్కడ పిల్లలకు సైబర్ నేరాల గురించి పూర్తిగా వివరించాలని అన్నారు. మారుతున్న డిజిటల్ ప్రపంచంలో పిల్లలు సురక్షితంగా, సమాచారంతో ఉండేందుకు సైబర్ విద్యను వారానికి ఒక సబ్జెక్టుగా చేర్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisment
తాజా కథనాలు