రూ.8.14 కోట్ల సైబర్ మోసం.. నిందితులను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8.14 కోట్లు కొట్టేసిన కేసులో ఇద్దరు నిందితులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.