/rtv/media/media_files/2025/08/03/cyber-crime-2025-08-03-10-59-37.jpg)
CYBER CRIME
నేటి కాలంలో రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఒకప్పటి రోజుల్లో కంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య పెరగడం వల్ల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంత వ్యక్తిగతంగా ఉన్నా కూడా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఏపీలో ట్రాఫిక్ చలానా పేరుతో లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తికి ట్రాఫిక్ చలానా పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1.36 లక్షలు కాజేశారు. దుగ్గిరాల మండలం, వీర్లపాలేకు చెందిన నిరంజన్ రెడ్డి అనే అతను హోటల్ యాజమాని.
ఇది కూడా చూడండి: Crime News : ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ
లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
ఇతనికి ట్రాఫిక్ చలానా పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. అందులో చలానా వెంటనే చెల్లించాలని, ఆ లింక్‌పై క్లిక్ చేయాలని ఉంది. ఆ యజమాని ఆ లింక్‌పై క్లిక్ చేయగానే ఓ యాప్ డౌన్‌లోడ్ అయ్యింది. దాన్ని ఓపెన్ చేయడంతో అతనికి డౌట్ వచ్చి యాప్ క్లోజ్ చేశాడు. ఆ తర్వాత తన క్రెడిట్ కార్డు(Credit Card) నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌లో వచ్చాయి. మొదటిసారి రూ.61,000, ఆ తర్వాత రూ.32,000 కట్ అయ్యాయి. దీంతో ఆ వ్యక్తి వెంటనే క్రెడిట్ కార్డును బ్లాక్ చేశాడు. అయినప్పటికీ మోసగాళ్లు మరోసారి రూ.20,999 కాజేశారు. ఇలా మొత్తం రూ.1.36 లక్షలు కాజేశారు. ఈ డబ్బుతో వారు మొబైల్ ఫోన్లు కొన్నట్లు ఆ యాజమానికి మెసేజ్‌లు వచ్చాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
సైబర్ నేరాల నుండి రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీకు తెలియని వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చే మెసేజ్‌లలో ఉండే లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. ఇలాంటి లింక్‌లు మీ ఫోన్‌లోకి మాల్‌వేర్ లేదా స్పైవేర్ పంపించే అవకాశం ఉంది. అలాగే బ్యాంకు పిన్‌లు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు లేదా కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్ ద్వారా ఇలాంటి సమాచారాన్ని అడగవు. మీ కంప్యూటర్, మొబైల్ ఫోన్‌లలో మంచి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం మంచిది. ఇది మీ డివైజ్‌లను వైరస్‌ల నుంచి రక్షిస్తుంది. మీ ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్‌లను ఎప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండాలి. పాత సాఫ్ట్‌వేర్‌లలో సైబర్ నేరగాళ్లు సులభంగా లోపాలు కనుగొనగలరు.
మోసానికి గురైనప్పుడు ఏమి చేయాలి?
సైబర్ మోసానికి(Cyber Crime) గురైతే వెంటనే మీ బ్యాంక్‌కు ఫోన్ చేసి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Telangana: దారుణం.. తెలంగాణలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్