Cyber ​​Criminals: మంత్రి అల్లునికే టోకరా..రూ.1.96 కోట్లు కొట్టేసిన సైబర్‌ కేటుగాళ్లు

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్‌ కూడాసైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కాడు. పునీత్‌ నిర్వహిస్తున్న ఐవీ గ్రీన్‌ ఇన్‌ఫ్రా అకౌంటెంట్‌కు అత్యవసరంగా రూ.1.96 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని మేసేజ్ పంపారు. అకౌంటెంట్ ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశాడు.

New Update
Cyber ​​criminals

Minister P. Narayana

ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు(Cyber ​​Crime) పెరిగిపోతున్నాయి. వయసుతో పని లేకుండా అన్ని వయసుల వారు సైబర్ నేరగాళ్ల బారిన పడి సర్వం కోల్పోతున్నారు. ఇప్పుడంతా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ పెరిగిపోవడంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. క్యూఆర్ కోడ్స్, లింకులతో జనాల వద్ద ఉన్న సొమ్మును దర్జాగా కాజేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సామాన్యులు మాత్రమేకాక వీఐపీల వరకూ సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి కోట్లు పోగొట్టుకుంటున్నారు.  ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్‌ కూడాసైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కాడు.పునీత్‌ నిర్వహిస్తున్న ఐవీ గ్రీన్‌ ఇన్‌ఫ్రా అకౌంటెంట్‌కు పునీత్‌ పేరిట సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ మేసేజ్‌ పెట్టారు. అత్యవసరంగా తాను పంపిన ఖాతాకి రూ.1.96 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని మేసేజ్ పంపారు.  

పునీత్‌ నిర్వహిస్తున్న ఐవీ గ్రీన్‌ ఇన్‌ఫ్రా(IV Green Infra) అకౌంటెంట్‌కు పునీత్‌ పేరిట సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​Criminals) వాట్సాప్‌ మేసేజ్‌ పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నానని అర్జెంటుగా రూ.1.96 కోట్లు కావాలంటూ మెసేజ్ రావడంతో పునీత్‌ అని నమ్మిన అకౌంటెంట్ ఏమి ఆలోచించకుండా ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే, తాము మోసపోయామని గ్రహించిన పునీత్, అకౌంటెంట్ జరిగిన విషయాన్ని సైబర్ క్రైమ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులు అరవింద్ కుమార్‌తో పాటు సంజీవ్‌లను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే దీనిపై వెంటనే సైబర్‌ పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమైన నెల్లూరు రూరల్‌ పోలీసులు సైబర్‌ నేరగాళ్ల ఖాతా నుంచి కోటీ 40 వేల రూపాయలు ఫ్రీజ్‌ చేశారు. న్యాయస్థానం సూచనతో రూ.49 లక్షలు విడుదలకు అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సైబర్‌ కుట్రలో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా.. భారీ మొత్తాల్లో నగదు ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ఉపయోగించే కరెంట్‌ ఖాతాదారులకు సైబర్‌ నేరగాళ్లు 2శాతం నగదు కమీషన్‌గా చెల్లిస్తున్నారని తమ విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు.

Also Read :  విజయనగరంలో దారుణం.. పెళ్లయిన 8 నెలలకే దంపతుల మృతి

ఓ శాస్త్రవేత్తను కూడా..

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ శాస్త్రవేత్త కూడా సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కాడు. సైబర్‌ నేరగాళ్లు ఏకంగా రూ.12.5 లక్షలు కాజేశారు. ఆధార్‌ కార్డుతో తీసుకున్న సిమ్‌ కార్డుతో పబ్లిక్‌ హరాస్‌మెంట్‌ చేస్తున్నారని బెదిరించి ఈ మోసానికి పాల్పడ్డారు. పటాన్‌చెరు మండలంలోని పోచారం గ్రామం పరిధిలోని గణపతిగూడెంలోఉంటున్న ప్రిన్సిపాల్‌ శాస్త్రవేత్త లక్ష్మణ్‌కు జూన్‌ 27న ముంబై నుంచి ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘‘మీ ఆధార్‌ నంబర్‌తో తీసుకున్న సిమ్‌ నుంచి పబ్లిక్‌ హరాస్‌మెంట్‌ మెసేజ్‌లు వస్తున్నాయి. మీపై 17 కేసులు నమోదయ్యాయి’’ అంటూ బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసు దుస్తుల్లో ఉన్న మరో వ్యక్తి వీడియో కాల్‌ చేసి ‘‘మీరు అక్రమంగా బ్యాంకు ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు’’ అని భయపెట్టాడు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే రూ. 42 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అది నిజమేనని నమ్మిన శాస్త్రవేత్త, గత నెల 24న రెండు రెండు సార్లు ఒకసారి  రూ.10 లక్షలు, ఈ నెల 5న రూ. 2.5 లక్షలు సైబర్‌ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాలోకి పంపాడు. మరింత డబ్బు డిమాండ్‌ చేయడంతో అనుమానం వచ్చిన లక్ష్మణ్‌ పోలీసులను ఆశ్రయించారు.

Also Read : AP Mega DSC Results: మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు