/rtv/media/media_files/2025/10/05/cyber-crime-2025-10-05-21-37-07.jpg)
Cyber Crime
ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాలు ఎంచుకుని మరీ సైబర్ కేటుగాళ్లు అమాయకులు వల విసిరి లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. లాలాగూడకు చెందిన ఓ వ్యక్తి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో కారు రెంటుకు తీసుకునేందుకు గూగుల్‌లో వెతికాడు.
Also Read: ఆ ప్రాంతాన్ని వెనక్కు తీసుకోవలసిందే...పీవోకే పై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
అతడికి శివశక్తి కార్ రెంటల్స్ అనే వెబ్‌సైట్ కనిపించింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేశాడు. దీంతో రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.149 చెల్లించాలని చెప్పారు. అలాగే ఏపీకే ఫైల్ పంపి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచనలు చేశారు. ఇది నమ్మిన ఆ బాధితుడు ఫీజు చెల్లించాడు. ఆ తర్వాత ఏపీకే ఫైల్‌ను డొన్‌లోడ్ చేశాడు. దీంతో ఏపీకే ఫైల్‌ని మాల్వేర్ ద్వారా సైబర్ కేటుగాళ్లు అతడి బ్యాంకు ఖాతాలో నుంచి రూ.1.98 లక్షలు కాజేశారు. చివరికి తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
Also Read: ఇన్సూరెన్స్ డబ్బులకోసం దారుణం..వ్యక్తిని చంపి భార్యగా నమ్మించి...ట్విస్ట్ ఏంటంటే?