Digital Arrest: ఎంపీ భార్యను డిజిటల్‌ అరెస్టు చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 లక్షలు కాజేసి..

ప్రస్తుతం డిజిటల్ అరెస్టు కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సామాన్యులే కాకుండా చదువుకున్న వాళ్లు, ప్రొఫెషనల్స్‌ కూడా వీటి ఉచ్చులో పడి లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో మరో డిజిటల్ అరెస్టు చోటుచేసుకుంది.

New Update
MP’s Wife Falls Prey To Digital Arrest, Loses Rs 14 Lakh In Cyber Fraud

MP’s Wife Falls Prey To Digital Arrest, Loses Rs 14 Lakh In Cyber Fraud

ప్రస్తుతం డిజిటల్ అరెస్టు కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సామాన్యులే కాకుండా చదువుకున్న వాళ్లు, ప్రొఫెషనల్స్‌ కూడా వీటి ఉచ్చులో పడి లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో మరో డిజిటల్ అరెస్టు చోటుచేసుకుంది. ఈసారి ఏకంగా ఓ ఎంపీ భార్యకే సైబర్ కేటుగాళ్లు బురిడి కొట్టించారు. ఆమెను బెదిరించి ఏకంగా రూ.14 లక్షలు కాజేశారు. ఇంతకీ అసలోం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లాపూర్‌ ఎంపీ కె. సుధాకర్‌ భార్య ప్రీతికి ఓ వ్యక్తి ముంబయి సైబర్ డిపార్ట్‌మెంట్ అధికారి అంటూ కాల్ చేశాడు. 

Also Read: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు మృతి

సద్బత్‌ఖాన్ అనే వ్యక్తి ఆమె డాక్యుమెంట్స్‌ వినియోగించి, క్రెడిట్ కార్డు తీసుకున్నాడని ఆ సైబర్ నేరగాడు ప్రీతిని నమ్మించాడు. దీనివల్ల చట్టవిరుద్ధమైన లావాదేవీలు జరిగాయంటూ ఆమెను భయపెడుతూ, బెదిరించాడు. ప్రస్తుతం తాము సద్బత్‌ఖాన్‌ను అరెస్టు చేశామని.. అతడు మాకిచ్చిన స్టేట్‌మెంట్‌లో ప్రీతి పేరు చెప్పినట్లు చెప్పాడు. ఈ డాక్యుమెంట్లు ధ్రువీకరించేందుకు వీడియో కాల్ చేయాలని.. లేకుండా అన్ని అకౌంట్స్ నిలిపివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండకూడదంటే తనకు రూ.14 లక్షలు పంపించాలంటూ నమ్మించాడు. అలాగే RBI రూల్స్ ప్రకారం ఆ డబ్బును మళ్లీ రీఫండ్ చేస్తామంటూ చెప్పాడు. 

Also Read: కార్గో షిప్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వందల టన్నుల బియ్యం

దీంతో ప్రీతి డబ్బులు పంపింది. ఆ తర్వాత వెంటనే కాల్‌ కట్ అయిపోయింది. చివరికి తాను మోసిపోయినట్లు ప్రీతి గ్రహించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 26న ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే సైబర్ కేటుగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో కొత్త కొత్త పద్దతుల్లో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. చాలామంది వాళ్ల మాటలు నమ్మి సమాజంలో పలుకుబడి పోతుందనే భయంతో వారికి లొంగిపోతున్నారు. 

Also Read: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. H1B వీసా రూల్‌తో అమెరికన్ కంపెనీలకు లక్షల కోట్ల భారం

వాస్తవానికి ప్రభుత్వ అధికారులు గానీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు గానీ ఫోన్‌కాల్స్ చేసి డబ్బులు ఇవ్వాలని అడగవు, కేసులను విచారించవు, అలాగే వెంటనే అరెస్టు చేస్తామంటూ బెదిరించవు. ఈ విషయాన్ని సైబర్‌ నిపుణులు, పోలీసులు పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ చాలామంది ఇలాంటి మోసాలకు బలైపోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా గతంలో మన్‌ కీ బాత్‌ రేడియో ప్రసంగంలో డిజిటల్ అరెస్టు గురించి మాట్లాడారు. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ప్రభుత్వం కూడా దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.  

Also Read: భయపడకండి.. భారత్‌కు తిరిగి రండి.. H1-B వీసా హోల్డర్లకు నిపుణుడి పిలుపు!

Advertisment
తాజా కథనాలు