Digital Arrest: డిజిటల్‌ అరెస్ట్.. ఇద్దరు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టిన సైబర్‌ కేటుగాడు

సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని సూచనలు చేసినా కూడా కొంతమంది సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.డిజిటల్ అరెస్టు పేరుతో ఓ సైబర్ కేటుగాడు ఇద్దరు మహిళలను ఏకంగా 9 గంటల పాటు నగ్నంగా కూర్చోబెట్టాడు.

New Update
Digital Arrest

Digital Arrest

ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు కేసులు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని సూచనలు చేసినా కూడా కొంతమంది సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిజిటల్ అరెస్టు పేరుతో ఓ సైబర్ కేటుగాడు ఇద్దరు మహిళలను ఏకంగా 9 గంటల పాటు నగ్నంగా కూర్చోబెట్టాడు. ఇక వివరాల్లోకి వెళ్లే థాయ్‌లాండ్‌లో ఓ మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. జులై 17న బెంగళూరులో ఉన్న స్నేహితురాలిని కలిసేందుకు ఆమె వచ్చింది. ఆ సమయంలోనే ఆ ఉపాధ్యాయురాలికి సైబర్‌ నేరగాడు ఫోన్ చేశాడు. 

Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం

మీరు జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన నగదును అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేశారని.. వెంటనే కొలాబా పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని చెప్పాడు. దీంతో ఆ మహిళ కంగారుపడింది. చాలా ఏళ్ల నుంచి తాను భారత్‌లో లేనని చెప్పింది. అయినప్పటికీ అతడు డిజిటల్ అరెస్టు చేస్తున్నానని బెదిరించాడు. ఆమె నుంచి రూ.58,477 బదిలీ చేయించుకున్నాడు. ఆ మహిళతో పాటు తన స్నేహితురాలని పూర్తిగా సోదా చేయాలని వాట్సాప్‌ వీడియో కాల్ చేశాడు. గుర్తింపు కోసం పుట్టుమచ్చలు చూడాలని నగ్నంగా ఉండాలంటూ బెదిరించాడు. ఇలా ఆ ఇద్దరు మహిళలను 9 గంటల పాటు నగ్నంగా కూర్చోబెట్టాడు. 

Also Read: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

ఆ సైబర్ నేరగాడు ఎంతకీ వీడియో కాల్‌ కట్‌ చేయలేదు. దీంతో ఆ మహిళలే ధైర్యం తెచ్చుకుని ఫోన్ కట్‌ చేశారు. కొద్దిసేపటికీ జరిగిందంతా మోసమని తెలుసుకొని బెంగళూరు తూర్పు విభాగం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. డిజిటల్ అరెస్టు అనేది అంతా మోసమని.. ఇలాంటివి నమ్మకూడదని పోలీసులు వాళ్లకి అవగాహన కల్పించారు. 

Advertisment
తాజా కథనాలు