Karnataka: కర్ణాటకలో ఒకేసారి ఐదు పులులు మృతి
తమిళనాడు- కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హనూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు మృతిచెందాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.