Kangana Ranaut: 'అతను పాకిస్థానీయుడిలా ఉన్నాడు'.. న్యూయార్క్‌ మేయర్‌ అభ్యర్థిపై కంగనా విమర్శలు

అమెరికాలోని న్యూయార్క్‌లో మేయర్‌ పదవి కోసం భారత సంతతికి  చెందిన జోహ్రాన్ మమ్దానీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై ప్రముఖ నటి, బీజీపీ ఎంపీ కంగనా రనౌత్‌ విమర్శలు చేశారు.

New Update
Kangana Ranaut criticizes Zohran Mamdani

Kangana Ranaut criticizes Zohran Mamdani

అమెరికాలోని న్యూయార్క్‌లో మేయర్‌ పదవి కోసం భారత సంతతికి  చెందిన జోహ్రాన్ మమ్దానీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై ప్రముఖ నటి, బీజీపీ ఎంపీ కంగనా రనౌత్‌ విమర్శలు చేశారు. డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే మమ్దానీ గెలిచారు. దీంతో ఆయనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు చేయగా.. తాజాగా కంగనా రనౌత్ కూడా ఆయన గెలుపును ఉద్దేశిస్తూ ఎక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీ గానే ఎక్కువగా కనిపిస్తున్నాడంటూ విమర్శలు చేసింది. 

Also Read: సైబర్‌ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం..  700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు

'' మమ్దానీ తల్లి పేరు మీరా నాయర్. ఆమె ఒక ఉత్తమ ఫిల్మ్‌ మేకర్. పద్మ శ్రీ కూడా సాధించారు.ఆమె న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ భారత్‌లోనే పుట్టి పెరిగారు.  గుజరాత్‌కు చెందిన మొహ్మద్‌ మమ్దానీని పెళ్లి చేసుకొని న్యూయార్క్‌లో సెటిల్ అయ్యారు. ఆయనకు కూడా మంచి రచయితగా గుర్తింపు ఉంది. వాళ్ల కొడుకు జోహ్రాన్ మమ్దనీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. అతని భారత మూలాల్లో ఏదో జరిగినప్పటికీ.. ఇప్పడు అతను హిందుమతాన్ని తుడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని'' కంగనా రాసుకొచ్చారు.  

ఇదిలాఉండగా.. జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ఉగాండాలోని భారతీయ మూలాలు ఉన్న కుటుంబంలో జన్మించారు. జోహ్రాన్ తండ్రి ప్రొఫెసర్‌ మొహ్మద్‌ మమ్దానీ. తల్లి మీరా నాయర్‌ ప్రముఖ దర్శకురాలు. ఆయన భార్య సిరియా మోడల్‌ రమా దువాజీ. అయితే జోహ్రాన్ రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇప్పుడు న్యూయార్‌ మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 

Also Read: టోల్‌ ట్యాక్స్‌ కట్టాలని అడిగినందుకు.. తుపాకీతో కాల్పులు

న్యూయార్క్‌లో ఉచిత బస్సు ప్రయాణం, పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో పాపులారిటీ సంపాదించారు. కానీ ఆయనపై పాలస్తీనా మద్దతుతో సహా పరిపాలన అనుభవం లేదు అనే వాటిపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు