/rtv/media/media_files/2025/06/26/medical-and-health-department-2025-06-26-21-18-02.jpg)
Medical and Health Department
Hyderabad: తెలంగాణ వైద్యారోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 52 పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి వైద్యారోగ్యశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. రెండు విభాగాలకు గాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ మేరకు రెండు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. కాగా బోర్టు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
Also Read: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !
స్పీచ్ పాథాలజిస్టు పోస్టులకు జులై 12 నుంచి 26 వరకు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 14 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. కాగా అన్ని పోస్టులకు గాను ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. మరింత సమాచారం కోసం రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్ సైట్‌లో చూడొచ్చని తెలిపింది. కాగా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే వైద్య ఆరోగ్య శాఖ లో 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఈ సందర్భంగా ప్రకటించడం గమనార్హం. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ వంటి మరో 6వేల పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడుతామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. త్వరలోనే మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా బోర్డు ప్రకటించింది.
Also Read: టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు.. తుపాకీతో కాల్పులు