Sports: ఇది టీ20 కాదు.. దయచేసి ఆపని చేయవద్దు.. పంత్‌ విన్యాసాలపై అశ్విన్

రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు చేయడాన్ని కొనియాడారు. అయితే ఇదే సమయంలో పంత్ విన్యాసాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

New Update
ashwin

Sports: రిషబ్ పంత్ పై మాజీ ఆటగాడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పై రెండు సెంచరీలు చేయడాన్ని కొనియాడారు. అయితే ఇదే సమయంలో పంత్ విన్యాసాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పంత్ దయచేసి ఆ ఫ్రంట్ ఫ్లిప్ చేయవద్దని కోరాడు. ఐపీఎల్‌లో శరీరం ఎక్కువగా అలసిపోదు. అప్పుడు ప్లిప్‌లు కొట్టినా ఫర్వాలేదు. కానీ టెస్టు క్రికెట్ భిన్నమైనదని, ఎక్కువసేపు ఆడేందుకు ఎనర్జీ కాపాడుకోవాలని సూచించాడు.

Also Read: ఈసీ కీలక నిర్ణయం.. 345 రాజకీయ పార్టీలు ఔట్‌

అలాగే టీమ్‌ఇండియా బ్యాటర్లు ప్రతి ఇన్నింగ్స్‌లోనూ ఒక విషయంపై దృష్టి పెట్టాలని చెప్పాడు. పరుగులు సాధించడం కంటే కూడా వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలన్నాడు. క్రీజులో ఉండి ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్‌లో అలసిపోయేలా చేయాలని,  అలాగైతే ఓటమికి భయపడాల్సిన పనిలేదన్నాడు. తుది జట్టులో భారీగా మార్పులు చేయకూడదు. రెండో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయగల సత్తా టీమ్‌ఇండియాకు ఉంది. అయితే, ఇంగ్లాండ్ వ్యూహాలను సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపాడు. 

ఇక పంత్‌ని ధోనీతో సరిపోల్చడం సముచితం కాదన్నాడు. పంత్ ఎక్కువసార్లు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. అతడిని విరాట్ కోహ్లీలాంటి వారితో పోల్చాలి. అతడు ప్రధానంగా బ్యాటర్ కావడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ఇంకా చాలా కెరీర్ ఉంది. బంతి లైన్, లెంగ్త్‌ని ముందుగానే అంచనా వేసి ప్రత్యేకమైన షాట్లు ఆడతాడు. ఈ ప్రత్యేక నైపుణ్యం ఉన్న అరుదైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకరంటూ పొగిడేశాడు. 

Advertisment
తాజా కథనాలు