/rtv/media/media_files/2025/05/23/wNWLg2h56JEBdYe79bol.jpg)
LIVE BREAKING
🔴Live News Updates:
Revanth Reddy - National Herald Case: రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
Revanth Reddy - National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు విరాళాలు అందించేందుకు సాయం చేసిన కాంగ్రెస్ నాయకుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. కానీ ఆయన్ని నిందితుడిగా పేర్కొనలేదు.
Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!
ఇక వివరాల్లోకి వెళ్తే..
ఏప్రిల్ 9న కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కొడుకు రాహుల్ గాంధీ.. యంగ్ ఇండియన్ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AGL) కు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు మళ్లించేందుకు ప్లాన్ వేసినట్లు ఆరోపణలు చేసింది. 2019-2022 మధ్య రేవంత్ రెడ్డితో పాటు పవన్ బన్సాల్, అహ్మద్ పటేల్ వంటి కొందరు కాంగ్రెస్ నేతలు ఏఐ, ఏజీఎల్‌కు విరాళాలు ఇచ్చేందుకు కొంతమందిని ప్రభావితం చేశారని ఈడీ తెలిపింది. ఈ విరాళాలు లీగల్ కావని.. రాజకీయ ప్రయోజనాలు ఆశించి వచ్చినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది.
Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్
ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు ?
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AGL) కంపెనీ.. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌ను ప్రచురించేది. అయితే 2008లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పేపర్ ప్రచురణ ఆగిపోయింది. దీంతో ఇండియన్ నేషలన్ కాంగ్రెస్ ఏజీఎల్ కంపెనీకి రూ.90.25 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చింది. దీంతో 2010లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కొత్త సంస్థ ప్రారంభమయ్యింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. అయితే యంగ్ ఇండియన్ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి ఏజీఎల్ ఆస్తులు పొందినట్లు, ఇందులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈడీ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీ కోర్టుకు ఈడీ చెప్పిన వివరాల ప్రకారం.. సోనియాగాంధీ తన AICC అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి, యంగ్ ఇండియన్ ద్వారా ప్రజా ధనాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఈడీ సోనియా గాంధీని ఏ వన్‌గా, రాహుల్‌గాంధీని ఏ2గా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది.
-
May 23, 2025 13:56 IST
Preity Zinta Files Legal Case: పంజాబ్ కింగ్స్ టీమ్‌లో వివాదం.. ఆ ముగ్గురిపై కోర్టుకెక్కిన ప్రీతి జింటా!
-
May 23, 2025 13:55 IST
TG News: అదంతా డ్రామా.. కవిత లేఖపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
-
May 23, 2025 12:48 IST
Telangana: తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. షెడ్యూల్ ఖరారు !
-
May 23, 2025 12:10 IST
Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
-
May 23, 2025 12:08 IST
BIG BREAKING: కడపలో కరోనా కలకలం.. రెండు కేసులు నమోదు!
-
May 23, 2025 10:10 IST
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి యూనస్ రాజీనామా? వ్యాపిస్తున్న వార్తలు
-
May 23, 2025 10:08 IST
Floods in China: చైనాలో వరదల బీభత్సం.. 10 మంది మృతి
-
May 23, 2025 10:07 IST
Obesity: 2030 నాటికి 50 కోట్ల మందికి ఉబకాయం.. లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు
-
May 23, 2025 07:15 IST
Rains: రెండు వైపుల నుంచి ముంచుకొస్తోంది..అరేబియాలో వాయుగుండం, బంగాళాఖాతంలో అల్పపీడనం
-
May 23, 2025 07:14 IST
Jai Shankar: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్