/rtv/media/media_files/2025/05/22/KFBCi83uuOF4C6UtWjtj.jpg)
Kavitha Letter To KCR
బీఆర్ఎస్‌లో సంచలనంగా మారిన కేసీఆర్‌కు కవిత లేఖ గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్‌కు లేఖ తానే రాసినట్లు ఆమె ఒప్పుకున్నారు. మా నాయకుడు కేసీఆరే అని కవిత క్లారిటీ ఇచ్చారు. అంతర్గతంగా ఆమె రాసిన లేఖ బయటకు ఎలా లీక్ అయ్యిందని కవిత అన్నారు. కేసీఆర్‌ను తప్పుుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అంతర్గతంగా ఆమె తండ్రికి రాసిన లేఖ ఎలా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చేరిందని అనుమానం వ్యక్తం చేశారు. రెండు వారాల క్రితం లేఖ రాశానని కల్వకుంట్ల కవిత ఒప్పుకున్నారు. ఆమె కొడుకు కాన్వకేషన్ ప్రొగ్రామ్‌కు వెళ్లి వచ్చే సరికి లెటర్ ఎలా లీక్ అయ్యిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరూ అనే కొత్త అనుమానాలు రేకెత్తించారు ఆమె. కవిత ఆ మాటలు కుటుంబసభ్యుల గురించి చెబుతూ మాట్లాడారా? లేకా బయట వ్యక్తుల గురించి చెప్పారు. కేసీఆర్‌కు గతంలో కూడా తన దాకా వచ్చిన విషయాలను లేఖగా రాశానని కవిత అన్నారు. ఈసారి లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆమె షాక్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని కవిత ఆరోపించారు. లేఖలో ప్రస్తావించినవి ఆమె సొంత అభిప్రాయాలు కావని కవిత వివరించారు. తన పర్యటనలో ఆమె దృష్టికి వచ్చిన అంశాలనే పార్టీ అధినేతకు లేఖ రాశానని చెప్పారు. పార్టీ కార్యక్రమాల గురించి ఎప్పుడూ ఆమె ఫీడ్‌బ్యాక్ లెటర్ ఇచ్చానని కవిత తేల్చి చెప్పారు.
brs-mlc-kalvakuntla-kavitha | brs-mlc-kavitha | kavitha | Kavitha Letter To KCR | brs | latest-telugu-news