/rtv/media/media_files/2025/05/23/oY04aheXbiquwq3XhFXp.jpg)
Preity Zinta
Preity Zinta Files Legal Case: పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టులో వివాదం చెలరేగింది. ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింటా ఇతర డైరెక్టర్లపై కోర్టులో దావా వేశారు. కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ సహ డైరెక్టర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలకు వ్యతిరేకంగా ప్రీతి జింటా చండీగఢ్ కోర్టులో దావా వేసింది. ఏప్రిల్ 21వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం చట్టబద్ధతను ఆమె కోర్టులో సవాలు చేసింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
IPL 2025: Preity Zinta moves court against Punjab Kings co-owners over disputed meeting
— IANS (@ians_india) May 22, 2025
· Punjab Kings co-owner and Bollywood actress Preity Zinta has filed a legal case against her fellow co-directors Mohit Burman and Ness Wadia in a Chandigarh court. The three are directors… pic.twitter.com/MsVz8vp439
ఇది కూడా చూడండి: Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
రూల్స్ పాటించకుండానే..
కంపెనీ రూల్స్ 2013 ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సమావేశం నిర్వహించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి అభ్యంతరాలను ఆమె మెయిల్ రూపంలో తెలియజేసినప్పటికీ కూడా పట్టించుకోలేదని ఆమె పిటిషన్‌లో తెలిపారు. అయితే నెస్ వాడియా మద్ధతుతో మోహిత్ బర్మాన్ ఈ సమావేశాన్ని నిర్వహించారని ప్రీతి జింటా ఆరోపించింది.
ఇది కూడా చూడండి: Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక
ఈ సమావేశంలో హాజరు అయినప్పటికీ కూడా ఈ సమావేశం చెల్లదని ప్రకటించాలని ప్రీతి జింటా కోర్టును కోరింది. అయితే మునీశ్ ఖన్నాను డైరెక్టర్‌గా నియమించడానికి ప్రీతి జింటా, పాల్ ఒప్పుకోలేదు. అతని నియామకాన్ని ఆపేయాలని పిటిషన్‌లో కోరింది. అలాగే తాను, కరణ్‌పాల్ లేకుండా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా చూడాలని కోర్టును ప్రీతి జింటా కోరింది.
ఇది కూడా చూడండి: Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి