/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Central-Government--jpg.webp)
భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్నారు. మధ్యలో ఒకసారి తన జోక్యం లేదని చెప్పినా మళ్ళీ సందర్భం వచ్చిన ప్రతీసారి నేనే కదా ఆపాను అంటూ గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. భారత్, పాక్ ల మధ్య అణు యుద్ధం జరగాల్సిందేనని...అది తన వల్లనే ఆగిందని కూడా చెప్పుకుంటున్నారు ట్రంప్. దీనిపై భారత్ ఇప్పటికే చాలా సార్లు క్లిరిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి నెదర్లాండ్స్ కు భారత విదేశాంగ మంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అమెరికా అమెరికాలోనే ఉందని..కాల్పులు విరమణ సమయంలో ట్రంప్ జోక్యం ఏమీ లేదని జైశంకర్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణపై తమ రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయని తెలిపారు. పాకిస్థాన్‌కు ఆయుధాలు ఎగుమతి చేస్తోన్న రెండో అతిపెద్ద దేశం నెదర్లాండ్స్.
అమెరికా...అమెరికాలోనే ఉంది..
ఈసారి విదేశాంగ మంత్రి జైశంకర్ కాల్పులు విరమణ గురించి చాలా గట్టిగానే చెప్పారు. తమ రెండు దేశాలు హాట్ లైన్ లో నేరుగా మాట్లాడుకున్నాయని...దానికి తగిన వ్యవస్థ ఉందని చెప్పారు. పాక్ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది. ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశం చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. అమెరికా.. అమెరికాలోనే ఉందని మంత్రి సూటిగా బదులిచ్చారు. ఉద్రిక్త సమయంలో అమెరికాతో మాట్లాడిన మాట నిజమే కానీ...దీని గురించి కాదని ఆయన అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మన ప్రధానితో మాట్లాడారు ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా తనకు ఫోన్ చేశారు. ఇలా ఒక్క అమెరికానే కాదు చాలా దేశాలు తమతో మాట్లాయి అని జైశంకర్ చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. ఇతర దేశాల నుంచి కాల్స్ రావడం సహజమే. కానీ కాల్పుల విరమణ గురించి భారత్-పాక్ నేరుగా మాట్లాడుకున్నాయి. అసలు అమెరికాతో సహా అన్ని దేశాలు దీని గురించి నేరుగానే మాట్లాడుకోవాలని సలహా ఇచ్చాయని కూడా జైశంకర్ చెప్పారు.