చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహన్, గాంగ్‌డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ నగరాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారు. రోడ్లన్ని చెరువుల్లా మారిపోయాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు, ఇళ్లు నేలకూలాయి. వందలాది కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో లక్షలాది జనం రోడ్డున పడ్డారు. ఈ వరదల ధాటికి కోట్లల్లో నష్టం వాటిల్లింది.
Massive floods due to extreme rains in Wuhan of Hubei province, China 🇨🇳 (22.05.2025) pic.twitter.com/zEwAxXmLmA
— Disaster News (@Top_Disaster) May 22, 2025
Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!
ఇదిలాఉండగా ఇటీవల అమెరికాను టోర్నడోలు వణికించాయి. మధ్య అమెరికా రాష్ట్రాల్లో కొన్నిరోజుల క్రితం నాలుగు టోర్నడోలు సంభవించాయి. వీటి ధాటికి టెక్సాస్ నుంచి కెంటకీ వరకు ఉన్న ప్రాంతాల్లో కొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. అనేకచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఓక్లహామాలో అగ్నిమాపక కేంద్రంతో పాటు కనీసం 10 నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 1,15,000 మంది చీకట్లోనే ఇరుక్కుపోయారు. టోర్నడోల ధాటికి ఇప్పటిదాకా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్
telugu-news | rtv-news | Heavy Rains | china-floods