BIG BREAKING: కవిత కటౌట్‌లో కనిపించని గులాబీ రంగు.. ఎయి‌ర్‌పోర్ట్‌ దగ్గర కోలాహలం

తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ సంచలనంగా మారింది. ఆమె అమెరికా నుంచి వచ్చి ఈరోజు లేఖపై క్లారిటీ ఇవ్వనుంది. దీంతో ఆమె అనుచరులు, జాగృతి లీడర్లు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడ కూడా గులాబీ జెండాలు కనిపించలేదు.

author-image
By K Mohan
New Update
team kavitha akka

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత లేఖ సంచలనంగా మారింది. ఈరోజు ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకుంది. మరి కాసేపట్లో కవిత మీడియా ముందుకు వచ్చి తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖపై వివరణ ఇవ్వనున్నారు. దీంతో ఆమె అనుచరులు, పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడా కూడా గులాబీ జెండాలు కనిపించలేదు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని కార్యకర్తలు అక్కడకి వచ్చారు. అయితే ఎయిర్‌పోర్ట్ దగ్గరకు బీఆర్ఎస్ నాయకులు కూడా రాలేదు.

కవితకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలో బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కూడా లేవు. నీలిరంగు జెండాలు పట్టుకొని కవిత అభిమానులు, అనుచరులు నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు టీమ్ కవితక్క అనే ప్లక్సీలు పట్టుకొని కార్యకర్తలు సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మౌనంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏం చెబుతుందో అని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎదురుచూస్తున్నారు.

Shamshabad Airport | kavitha latter to KCR | brs | brs mlc kavitha

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు