/rtv/media/media_files/2025/05/23/35x2i08umF1XhGHDLlRr.jpg)
Israel Ambasidors
అమెరికాలో తాజాగా మరోసారి ఉగ్రదాడి జరగడం కలకలం రేపింది. రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందిపై తీవ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులు మృతి చెందారు. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపిన వివరాల ప్రకారం కేపటిల్ జెనిష్ మ్యూజియం దగ్గర్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇందులో యారోన్ లిషిన్‌స్కీ, సారా మిలిగ్రిమ్‌పై చాలా దగ్గర నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. అతనిని భద్రతా అధికారులు వెంటనే రెస్ట్ చేశారు. దుండగుడు ఫ్రీఫీ పాలస్తీనా అంటూ నినదాలు చేశాడు. దుండగుడు షికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. రదౌత్య వత్తల మృతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
కలిసి ఉండాలనుకుననారు.కానీ కలిసి చనిపోయారు..
కాల్పుల్లో మృతి చెందిన దౌత్య వేత్తలు యారోన్ లిషిన్‌స్కీ, సారా మిలిగ్రిమ్ ఇద్దరూ ఒకరిని ఒకరు బాగా ఇష్టపడ్డారు. త్వరలోనే పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారున నిశ్చితార్ధానికి రెడీ కూడా అయ్యారు. జెరూసలేంలో ఆమెకు ప్రపోజ్ చేసేందుకు యారోన్ లిషిన్‌స్కీ ఉంగరం కూడా తీసుకున్నాడు. అ్కడే ఎంగేజ్ మెంట్ చేసుకుందామని కూడా అనుకున్నారని ఇజ్రాయెల్ రాయబారి యహియల్ లైటర్ తెలిపారు. వారిద్దరిదీ అందమైన జంట అని ఆయన అన్నారు. కానీ ఇంతలోనే మృత్యువు ఇద్దరినీ కబళించింది. ముష్కరుడి కాల్పుల్లో యువ జంట ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలిచివేసింది.
today-latest-news-in-telugu | usa | washington-dc | Terrorist Attack | israel
Also Read: USA: హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల నిషేధం..భారతీయ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?