Encounter: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 27మంది మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణనుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరున్నట్లు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు. 

New Update
maoist enc

Police reveal Maoist casualties details

Encounter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 27మంది మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణనుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరున్నట్లు గుర్తించారు. ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు. 

కేశవరావుపై రూ.10 కోట్ల రివార్డు..

ఈ మేరకు మావోయిస్టు పార్టీ చీఫ్‌ నంబాల కేశవరావు సహా 27 మంది మృతదేహాలను హెలికాప్టర్లో జిల్లా కేంద్రానికి తరలించారు. వారందరి డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల వివరాలు వెల్లడించారు.  మృతుల్లో ఐదుగురు తెలుగువారు ఉన్నట్లు తెలిపారు. ఏపీకి చెందిన నంబాల కేశవరావు ఎలియాస్‌ బస్వరాజ్, సజ్జా నాగేశ్వరరావు ఎలియాస్‌ జంగు, తెలంగాణకు చెందిన సంగీత, భూమిక, బూర రాకేశ్‌ ఎలియాస్‌ యుగేంద్ర ఎలియాస్‌ వివేక్‌గా గుర్తించారు. ఇక నంబాల కేశవరావుపై మొత్తం రూ.10 కోట్ల రివార్డు ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతమ్‌ వెల్లడించారు.

Also Read: పాడు బుద్ధి పోనిచ్చుకోలేదు...వాతావరణం బాలేదన్నా పర్మిషన్ ఇవ్వని పాకిస్తాన్

ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు జవాన్లు రమేశ్‌ హేమ్లా, కోట్లూరాం కొర్రంల పార్థివదేహాలకు ఛత్తీస్‌గఢ్‌ హోం మంత్రి విజయశర్మ నివాళులర్పించారు. ఇక బూర రాకేశ్‌ (30) హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు. వన్నాడ విజయలక్ష్మి ఎలియాస్‌ భూమిక రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం, వేములనర్వ గ్రామానికి చెందినగా వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు