/rtv/media/media_files/2025/05/23/taKLi6JPJO60hJJSDHjP.jpg)
Close to 500 million young adults will be obese by 2030, Lancet study
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వీళ్లు ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థలను ఎదుర్కొంటారని లాన్సెట్ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. దాదాపు 100 కోట్ల మంది నిరోధించదగిన ఆరోగ్య సమస్యలతో బాధపడతారని చెప్పింది.
Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!
ప్రపంచంలో 10 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నవారు సగం మంది నిరోధించదగిన ఆరోగ్య సమస్యలు ఉండే దేశాల్లో ఉంటారని తెలిపింది. HIV/ఎయిడ్స్, మనో వ్యాకులత, పోషకాహార లోపం, తక్కువ వయసులో గర్భధారణ వంటి నిరోధించే సమస్యలకు వీరు గురవుతారని పేర్కొంది. యువత మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని, వాతావరణ మార్పులకు సంబంధించిన పర్యవసానాలు ఎదురవుతాయని తెలిపింది.
Also Read: బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి యూనస్ రాజీనామా? వ్యాపిస్తున్న వార్తలు
అలాగే ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల వచ్చే పర్యావసనాలు జీవితాంతం అనుభవించే తొలితరంగా నేటి యువత నిలుస్తుందని చెప్పింది. ఇక మొత్తానికి 2100 నాటికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆరోగ్య సమస్యలు తీవ్రతరమవుతాయని పేర్కొంది.
Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్
obesity | diseases-obesity | health | lifestyle | health-problems