Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!

పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌లో ఘోరం జరిగింది. కృష్ణేందు దాస్ అనే 13ఏళ్ల బాలుడుని ఓ షాపు యజమాని చిప్స్ దొంగిలించాడనే ఆరోపణలతో అందరి ముందు శిక్షించాడు. చేయని తప్పుకు నిందవేశారనే మనస్థాపం చెందిన కృష్ణేందు ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
Student Suicide

Student Suicide

Student Suicide News: "అమ్మా, నేను దొంగతనం చేయలేదు" అంటూ 13ఏళ్ల బాలుడు రాసిన సూసైడ్ నోట్ అందరి మనసులను కలచివేసింది. చేయని దొంగతనం తనపై మోపారనే అవమానంతో బాలుడు  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో జరిగింది.

Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

చిప్స్ దొంగిలించాడనే నింద 

స్థానికుల ప్రకారం,.. కృష్ణేందు అనే 13 ఏళ్ల బాలుడు బకుల్డా హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం గోసైన్‌బర్ మార్కెట్‌లోని  ఓ షాప్ యజమాని శుభాంకర్ దీక్షిత్.. కృష్ణేందు తన షాపు నుంచి మూడు చిప్స్ ప్యాకెట్లను దొంగిలించాడని ఆరోపణలు చేశాడు. స్థానికులు కూడా కృష్ణేందు చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నాడని ఆరోపించారు. దీంతో షాప్ యజమాని శంభాకర్ కృష్ణేందును కొట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పమని బలవంతం చేశాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా యజమాని వినలేదు. 

Also Read: ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదు: కేంద్రం

ఆ తర్వాత అతడి తల్లి కూడా దుకాణానికి తీసుకెళ్లి యజమాని ముందు మందలించింది. తాను దొంగతనం చేయకపోయినా తనపై నిందమోపడంతో కృష్ణేందు తట్టుకోలేకపోయాడు. ఇంటికి వచ్చాక ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు ప్రయతించాడు. విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు వెంటనే  తమ్లుక్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా,  అప్పటికే మృతి చెందాడు. ఆత్మహత్యకు ముందు కృష్ణేందు "అమ్మా, నేను దొంగతనం చేయలేదు" అంటూ లేఖను రాశాడు. దీంతో దుకాణదారుడి అవమానం వల్లే  తన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read: USA: హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల నిషేధం..భారతీయ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?

 క్రైం | Short News | Latest News In Telugu

Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు