Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదు: కేంద్రం

పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్‌ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌ రాజీపడదన్నారు.

New Update
External minister Jai shankar says operation sindoor has not stopped

External minister Jai shankar says operation sindoor has not stopped

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్ సిందూర్‌ ఇంకా కొనసాగుతోందని కేంద్రం మరోసారి తెలిపింది. నెదర్లాండ్, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటనలో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జై శంకర్ ఓ డచ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్‌ తప్పకుండా స్పందిస్తుందని.. ఉగ్రవాదులు పాక్‌లో ఎక్కడ దాక్కున్నా వేటాడి మరి దాడి చేస్తుందన్నారు. 

Also Read: పాడు బుద్ధి పోనిచ్చుకోలేదు...వాతావరణం బాలేదన్నా పర్మిషన్ ఇవ్వని పాకిస్తాన్

ఆపరేషన్‌ సిందూర్‌ను కొనసాగించడంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌ రాజీపడదన్నారు. ఆపరేషన్ కొనసాగించడం అంటే ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకోవడం కాదని.. ప్రస్తుతం కాల్పులు విరమణ కొనసాగుతుండటంతో సైనిక చర్యలు ఆగిపోయాయన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి రిలీజ్ చేసిన లిస్ట్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపైనే భారత్‌ దాడి చేసినట్లు స్పష్టం చేశారు. 

Also Read: మా తమ్ముడు చనిపోలేదు.. మావోయిస్టు కేశవరావు అన్న సంచలన ప్రకటన!

అలాగే భారత్‌-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఇరుదేశాల మధ్య నేరుగా చర్చలతోనే జరిగిందని తెలిపారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని ట్రంప్‌ పదేపదే అంటున్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు వాటితో వివిధ దేశాలు మాట్లాడటం అనేది సహజంగా జరుగుతుంది. పరిస్థితులను అదుపుచేసేందుకు అవి యత్నిస్తాయి. ఒక్క అమెరికాతోనే కాదు అన్ని దేశాలతో కూడా కాల్పుల విరమణ కావాలంటే పాకిస్థాన్‌నే మాట్లాడమనమండని చెప్పామని తెలిపారు. మే 10న పాక్‌ జనరల్ మాతో చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడుందని ప్రశ్నించగా.. అమెరికా.. అమెరికాలోనే ఉందని జైశంకర్‌ అన్నారు. 

ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్‌ తర్వాత.. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలు పాక్ ఆర్మీ సిబ్బంది వచ్చారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ఓ ఇంటర్వ్యూలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ స్పందించారు. దీనిపై ఆధారాలు చూపించాలని అడిగారు.  ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించలేదు. అయితే అసీమ్ మనీర్‌ తండ్రికి ఒసామా బిన్‌ లాడెన్‌ దగ్గరి సంబంధాలున్నాయని.. యునైటెడ్ నేషన్స్‌, అమెరికా ఉగ్రవాద లిస్టులో కూడా ఆయన పేరున్నట్లు తెలుస్తోంది. 

Also Read: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం

  Pahalgam attack | national-news | s-jaishankar 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు