/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
అరేబియా సముద్రంలో అల్పపీడనం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో రాబోయే 6 రోజుల్లో గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతంలో కూడా..
దీంతో పాటూ ఈ నెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెప్పింది. ఇది తరువాత ఉత్తర దిశగా పయనించి.. బంగ్లాదేశ్, మయన్మార్ వైపు వెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో 27 నుంచి మూడు రోజుల పాటూ ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని చెబుతున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. మాల్దీవులు, కొమొరిన్, లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది.
today-latest-news-in-telugu | weather | rains | andhra pradesh heavy rains
Also Read: GT VS LSG: చివరి ఆటల్లో ఈ మెరుపులేంట్రా..గుజరాత్ కు చెక్ పెట్టిన లక్నో