/rtv/media/media_files/2025/03/04/Tv5JaNTXgktYhaedpydO.jpg)
Muhammad Yunus
యూనస్ రాజీనామా వార్త బంగ్లాదేశ్ లో బాగా వ్యాపించింది. దాని గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన బీబీసీ కు కూడా ఆయన రాజీనామా గురించి ఆలోచిస్తున్ననని చెప్పారని తెలుస్తోంది. రాజకీయ పార్టీలు అన్నీ ఒక ఏకాభిప్రాయానికి రాకపోతే తాను ఇక పని చేయలేను అని ప్రధాన సలహాదారు యూనస్ చెప్పారని చెబుతున్నారు. బంగ్లాదేశ్ ఉన్న ప్రస్తుత పరిస్థితిలో పని చేయడం కష్టమేనని యూనస్ భయాన్ని వ్యక్తం చేశారని NCP కన్వీనర్ అన్నారు. యూనస్ కనుక రాజీనామా చేస్తే మళ్ళీ బంగ్లాదేశ్ లో తిరుగుబాటులు జరుగుతాయని చెప్పారు.
ఎవరూ సహకరించడం లేదు..
బంగ్లాదేశ్ భవిష్యత్తు బావుండాలంటే అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఐక్యత ఏర్పరచుకోవాలని ఎన్సీపీ నాయకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అందరూ యూనస్ కు సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఆయన పనిని ఆయన్ను చేసుకోనివ్వకపోతే ఎలా ఉంటారని ప్రశ్నించారు. గత రెండు రోజులుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా సవాళ్ళను ఎదుర్కోంటోందని...అందులో బంగ్లా ఏకీకృత సైనిక దళాలు, మళ్ళీ తిరుగుబాటు ఆలోచనలు ముఖ్యమైనవి అని ఎన్సీపీ నే చెప్పారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిన సమయంలో తిరుగుబాటు దళాలను అణిచివేయకూడదని సైన్యానికి ఆంక్షలు పెట్టారు. ఇది వారికి నచ్చలేదు. ఇప్పుడు వారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని కారణంగా యూనస్ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.