/rtv/media/media_files/2025/05/23/l2w2bdfXDzjhEsREEQ6P.jpg)
thamilnadu crime news
Crime News: తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. పళని సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆయన ఒక్కసారిగా కూలిపోవడం, బస్సు అదుపు తప్పే ప్రమాదం ఉండగా వెంటనే స్పందించిన కండక్టర్ అప్రమత్తతతో అందరి ప్రాణాలను రక్షించాడు. బస్సు ప్రయాణంలో ఉండగానే డ్రైవర్ అనుకోకుండా హార్ట్ ఎటాక్‌కు గురై స్పాట్‌లోనే మరణించాడు.
Also Read : ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు
బస్సు రన్నింగ్‌లో గుండె పోటు..
ఇది కండక్టర్‌కు అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే ముందుకు వచ్చి స్టీరింగ్ పట్టుకొని బ్రేకులు వేశాడు. దీంతో బస్సు అదుపులోకి వచ్చింది. ప్రయాణికులు కూడా అప్పటివరకు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా గమనించారు. డ్రైవర్ స్పృహ కోల్పోయినప్పటికీ.. కండక్టర్ చురుకుదనంతో స్పందించి ముప్పు తప్పించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడిన ఈ కండక్టర్‌ను అందరూ అభినందిస్తున్నారు. కండక్టర్ సమయ స్పూర్తి ఎంతో మందికి ఇది స్ఫూర్తిదాయకంగా మారింది.
ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో తల్లీబిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
பழனி அருகே மாட்டுப் பாதையில் தனியார் பேருந்து ஓட்டுநர் திடீர் மாரடைப்பால் மரணம். துரிதமாக செயல்பட்டு பேருந்தை நிறுத்திய நடத்துநர்.#heartattack #TamilNadu #Chanakyaa
— சாணக்யா (@ChanakyaaTv) May 23, 2025
Stay informed with the latest news through Chanakyaa via https://t.co/sbYbLDGhBo pic.twitter.com/358EDntWLE
Also Read : వారానికి ఎన్నిసార్లు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి? సరైన మార్గాన్ని నేర్చుకోండి
అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయన చూపించిన తీరు, సమయస్పూర్తి, మానవతా దృష్టి కోణం ప్రశంసనీయం. డ్రైవర్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన ద్వారా డ్రైవింగ్ వంటి బాధ్యతాయుతమైన పనుల్లో ఆరోగ్యపరంగా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని క్షణాల్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: కుంకుమపువ్వు టీ తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?
( latest-news | bus | bus-driver )