Covid 19: కడపలో కరోనా కలకలం.. రెండు కేసులు నమోదు!

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్‌ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి.

New Update
corona-virus

corona-virus

Covid 19: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్‌ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. చాగలమర్రికి చెందిన ఓ మహిళ అనారోగ్యంలో బారిన పడటంతో చికిత్స కోసం రిమ్స్‌కు వచ్చారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటీవ్‌గా తేలింది. ఇక మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: మావోయిస్టు మృతుల వివరాలు వెల్లడించిన పోలీసులు.. తెలుగువారి లిస్ట్ ఇదే!

Covid 19: ఇటీవల విశాఖపట్నంలో కూడా ఓ వివాహితకు కరోనా సోకింది. . ఈమెతో పాటూ భర్త, పిల్లలకు కూడా వచ్చి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. అందరికీ వైద్యులు ఆర్టీపీసీ పరీక్షలు నిర్వహించారు. వారం రోజులు పాటూ హోం క్వారంటైన్‌లో ఉండాలని వారికి సూచించారు.

Also Read: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్

గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 257కు పైగా కేసులు నమోదయినట్టు వైద్యశాఖ వెల్లడించింది. మరోవైపు ప్రజలకు ఏపీ ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌లు, విమానాశ్రయాల్లో COVID-19 రూల్స్ పాటించాలని సూచించింది. కరోనా వైరస్‌పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసింది. 

కోవిడ్ పై ప్రజలకు ఆరోగ్య శాఖ సలహా

1. ప్రార్థన మందిరాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాలను వెంటనే నిలిపివేయండి. 
2. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు & విమానాశ్రయాల్లో COVID-19 తగిన నియమాలను పాటించాలి.
3. వృద్ధులు (60 ఏళ్లు పైబడినవారు), గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలి.
4. పరిశుభ్రతను పాటించండి. -తరచుగా చేతులు కడుక్కోండి. దగ్గు, తుమ్ముల బారినపడకుండా చూసుకోండి. 
5. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించండి. మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
6. మీకు కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. -
7. COVID ప్రభావిత దేశాల్లో ప్రయాణించిన వారు పరీక్షలు చేయించుకోవాలి. 
8. సాధారణ లక్షణాలు: జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు లేదా విరేచనాలు
లక్షణాలు ఉన్నట్లైతే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లండి.
9. మీరు అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండండి.

kadapa | corona | corona-cases

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు