CM Chandrababu : MLA లకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు.
కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు.
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫారెస్ట్ సిబ్బందితో వివాదంలో ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పారు.
కడప జిల్లాలో ఖాళీ అయిన కార్పొరేషన్ మునిసిపల్ కౌన్సిలర్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం, రాయచోటి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
హైదరాబాద్‌లో సినీ నిర్మాత దాసరి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సమీప బంధువు గాజుల మహేష్ ఫిర్యాదు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గాజుల మహేష్ వద్ద కిరణ్ నాలుగున్నర కోట్లు అప్పుతీసుకొన్నాడు. తిరిగి ఇవ్వామంటే దాడి చేశాడని మహేశ్ ఆరోపించారు.
నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ మంజూరు చేయించడంలో చక్రం తిప్పిన అరుణను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వాయవ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ నెల 25 వరకు కురుస్తాయని తెలిపింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఈరోజు ఉదయం ఒడిశా- ఉత్తర కోస్తా సమీపంలోని గోపాల్ పూర్ వద్ద తీరం దాటింది. వాయుగుండం ప్రభావం వల్ల ఈరోజు కూడా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు మంగళవారం పీ4 అమలు కార్యక్రమాన్ని ఆగస్టు 19న ప్రారంభించారు. ఇప్పటికే పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారు.