ALERT: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక

అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉంది.

New Update
ALERT Ap

ఆంధ్రప్రదేశ్ ‌రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యదిశగా పయనించే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రానున్న 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉంది.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisment
తాజా కథనాలు