BREAKING: YSR నిజమైన వారసుడు నా కొడుకే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకే రాలేదు.. అప్పుడే మీరు భయపడిపోతున్నారని షర్మిల అన్నారు. ఎన్ని కుక్కలు మొరిగినా.. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డికి నిజమైన వారసుడు నా కొడుకు రాజారెడ్డి అని ఆమె చెప్పుకొచ్చారు.

New Update
sharmila comments

Sharmila

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, అన్న జగన్‌పై విమర్శలు చేశారు. నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకే రాలేదు.. అప్పుడే మీరు భయపడిపోతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్ని కుక్కలు మొరిగినా.. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డికి నిజమైన వారసుడు నా కొడుకు రాజారెడ్డి అని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె కుమారుడికి రాజారెడ్డి అని పేరు పెట్టింది తండ్రి YSRయే అని షర్మిల చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజా రెడ్డి పేరు షర్మిల కుమారుడికి పెట్టిన విషయం తెలిసిందే.

ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు షర్మిల. అందుకే సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వలేదని విమర్శించారు. సరైన సమయం వచ్చినప్పుడు ఆమె కొడుకు రాజా రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు చేసిన విమర్శలకు కౌంటర్ ఆమె ఇలా మాట్లాడారు.

YSR ఛాతీలో కత్తి పొడిచిన వ్యక్తి జగన్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. YCP సైతాన్ సైన్యం, ఎన్ని కుక్కలు మొరిగినా నా కొడుకు YS రాజారెడ్డి.. YSRకి రాజారెడ్డి రాజకీయ వారసుడు అని షర్మిల అన్నారు. నా కొడుకుని చంద్రబాబు చెప్తే రాజకీయాల్లోకి తీసుకు వస్తే.. మీరు ఎవరు చెప్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో BJPకి ఓటు వేశారని ఆమె వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. YS రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే జగన్ చేసిన పనికి సిగ్గుతో, అవమానంతో తల దించుకునే వాడని ఆమె అన్నారు. చరిత్రలో YSR ఛాతీలో కత్తితో పొడిచిన వ్యక్తిగా జగన్ మిగిలిపోయాడని అన్న జగన్‌పై షర్మిల ఫైర్ అయ్యారు.

మెడికల్ కాలేజీల కుట్ర

రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి రూ.2 లక్షల అప్పు ఉంది.- రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని ఉందని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. రైతుల సమస్యలు కొండత.. ప్రభుత్వ పథకాలు గోరంత అని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే అన్నదాత సుఖీభవ రూ.20 వేలు ఏ మూలకు సరిపోదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. YCP హయంలో కాలేజీలు పూర్తి కాకుంటే అవి కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలి కదా? అని నిలదీశారు. అలా కాకుండా మెడికల్ కాలేజీలను నారాయణ లాంటి వాళ్లకు అప్పజెప్పాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని షర్మిల అన్నారు.

Advertisment
తాజా కథనాలు